తెలంగాణలో రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాఖలు కేటాయించారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ సమక్షంలో… ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
♦️డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి భట్టి విక్రమార్క
♦️హోం మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి,
♦️మున్సిపల్ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
♦️డి.శ్రీధర్‌బాబు-ఆర్థిక శాఖ
♦️పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదల శాఖ
♦️కొండా సురేఖ-మహిళా సంక్షేమ శాఖ
♦️దామోదర రాజనర్సింహ-వైద్య ఆరోగ్య శాఖ
♦️జూపల్లి కృష్ణారావు-పౌరసరఫరాల శాఖ
♦️సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ
♦️తుమ్మల నాగేశ్వరరావు-రోడ్లు భవనాలు
♦️పొన్నం ప్రభాకర్-బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు.