ఏపిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. వచ్చే సంవత్సరం 2024 ఏప్రిల్లో ఏపిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది ఉన్నారు. వీరిలో పదవతరగతి చదివేవారు 6 లక్షలు అలాగే ఇంటర్ చదివేవారు 10 లక్షలు మంది పరీక్షలు రాయబోతున్నారు. కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం12గం.45ని.వరకు పరీక్షల సమయంగా నిర్ణయించారు.
- మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
- మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్
- 20 న ఇంగ్లీష్
- 22 తేదీ లెక్కలు
- 23 న ఫిజికల్ సైన్స్
- 26 న బయాలజీ
- 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు
- 28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
- 30 న ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
- ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ
మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.