Vijay: తమిళనాట హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు… అక్కడ విజయ్ ను దళపతి అని పిలుచుకుంటారు అభిమానులు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అంతేకాదు ఏకంగా పార్టీ పేరును ప్రకటించారు.
నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ సరిగ్గా 90 రోజుల క్రితం నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి అన్న మాటలివి. ‘లియో’ విజయోత్సవ సభలో వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానగణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నాపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలికి చెప్పులా ఉండటానికి కూడా వెనకాడను. . ఈ మధ్య లియో విజయోత్సవ సభలో విజయ్ మాట్లాడిన దానికి అర్ధం ఏమిటో అభిమానులకు ఇప్పుడు అర్ధమైంది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి, మరోసారి వార్తల్లో నిలిచారు విజయ్.
తమిళనాట Tamil Nadu రాజకీయాల్లోకి సరికొత్త పార్టీ అడుగుపెట్టింది. ఈ పార్టీని స్థాపించింది ఎవరో కాదు.. ప్రముఖ అగ్ర కథానాయకుడు విజయ్ దళపతి. ఎప్పటి నుంచి రాజకీయ రంగప్రవేశం చేస్తారని ఎదురుచూన్న అభిమానులకు శుభవార్త చెప్పారు దళపతి. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వి సోషల్ మీడియాలో జయ్ అధికారికంగా ప్రకటించారు. అయితే 2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటిలో ఉంచడంలేదని తెలిపారు.
తన పార్టీ పేరును ప్రకటించి విజయ్ ఈవిధంగా రాసుకోచ్చారు… ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు. ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం’’ అని విజయ్ వెల్లడించారు. దీంతో తమిళనాడు సీఎం పీఠం పై విజయే కన్ను వెసినట్లు కనిపిస్తుంది. ఎలాగో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు సంవత్సరాలు టైం ఈలోపు పార్టీ వ్యవహారాలు చక్కద్దిదుకోవచ్చుఅని విజేయ్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని దయపతి విజేయ్ తెలిపారు.
తమిళనాడులో సినియాల పరంగా చూసుకుంటే సూర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్తాయిలో క్రేజ్ ఉన్న హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది విజయ్ అని చెప్పవచ్చు. విజయ్ ను ఆయన అభిమాలనులు ‘దళపతి’ అని పిలుస్తుంటారు. చాలా కాలం నుంచి విజయ్ రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టంచేయడంతో.. విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం (అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరుతో పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసి ‘తమిళగ వెట్రి కళగం’ పేరును ఖరారు చేశారు.