Beauty Care: ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి

By manavaradhi.com

Updated on:

Follow Us

How To Remove Pimples In Telugu - ఇలా చేస్తే మొటిమలు మీ దరికి రమ్మన్నా రావు

అందంగా ఉండాలని అందరూ కలలు కంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. దీనికికారణం వాతావరణ కాలుష్యం,పని ఒత్తిడి,నీరు తక్కువగా తాగడం,నిద్రలేమి. కొన్ని ఇతర కారణాల వల్ల చర్మం జీవం కోల్పోయి నిర్జీవమైపోతుంది. చర్మ రక్షణ కోసం చాలామంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరబాట్ల వలన చర్మానికి హాని జరుగుతుంది. చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాటికి సంబంధించిన ఉత్పత్తుల్ని తరచుగా వాడడం చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగిస్తే చర్మంపై దద్దుర్లు ఏర్పడి.. కందినట్లుగా మారుతుంది. అలానే మృతుకణాలు తొలగించేందుకు రకరకాల స్క్రబ్‌లు వాడుతుంటారు. ఈ స్క్రబ్స్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.. కానీ, అదే పనిగా ఈ స్క్రబ్స్ వాడితే చర్మం పొడిబారుతుంది.

శరీరాన్ని శుభ్రపరచడానికి, అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, శరీరం కనిపించే తీరును మార్చడానికి కాస్మటిక్స్‌ను వాడతారు. చర్మంపైన ప్రయోగించే క్రీములు, లోషన్లు, పెర్‌ఫ్యూమ్‌లు, లిప్‌స్టిక్‌లు, గోళ్ల రంగులు, కళ్లకూ మొహానికి వేసుకునే మేకప్‌లు, జుట్టుకు వేసుకునే రంగులు, సబ్బులు, డియోడరెంటులు, వీటిని ప్రధానంగా కాస్మటిక్స్‌ అంటాం. కాస్మటిక్స్‌ అనేవి శరీర నిర్మాణాన్ని లేదా పని తీరుని మార్చవు. ఇవి కేవలం సౌందర్యాన్ని ఇనుమడింప చేసేందుకు మాత్రమే ఉద్దేశించినవి. సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మవ్యాధులు కలగడానికి మరో ప్రధాన కారణం వాటిల్లో కలిపే ప్రిజర్వేటివ్‌లు. గాలి వెలుతురులు తగిలి చెడిపోకుండా, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వంటివి పెరగకుండా కాస్మటిక్స్‌లో ప్రిజర్వేటివ్‌లను కలుపుతుంటారు. ఇవి సూక్ష్మక్రిములను నిరోధించే ప్రయత్నంలో చర్మాన్ని ఎంతో కొంత దెబ్బతీసి కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ వంటి వ్యాధులను కలిగించే అవకాశం ఉంది. ఒకరు వాడిన మేకప్‌లను మరొకరు వాడటం వల్ల చర్మంపైన వాడే కాస్మటిక్‌ బ్రష్‌లు, స్పాంజ్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. రాత్రి పడుకునేటప్పుడు అన్ని రకాల మేకప్‌లు తీసివేయాలి. అవసరమైతే, డాక్టర్ల సలహా మేరకు కాస్మటిక్స్‌ను వాడాలి.

  • చర్మం తన సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వేడినీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోకూడదు. బయటి ఉష్ణోగ్రతలను బట్టి చర్మం తట్టుకోగలిగేటంత గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు.
  • హైడ్రోజన్ పెరాక్సైడ్ ముఖం మీద నివసించే బ్యాక్టీరియాను చంపుతుంది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీ స్వంత చర్మ కణాలను దెబ్బతీస్తుంది, వీటిలో ఫైబ్రోబ్లాస్ట్‌లు కొత్త కణజాలాలను తయారు చేయడానికి మరియు గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ పెళుసైన చర్మాన్ని చికాకు పెట్టవచ్చు. కాబట్టి దీనికి బదులుగా సబ్బు మరియు నీరు వాడండి.
  • హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ క్రీమ్ వల్ల చర్మం సన్నగిల్లుతుంది. ఇది మీ చమురు గ్రంథులను ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్ళమని బలవంతం చేస్తుంది. ఎక్కువగా వాడడం వల్ల మెుటిమలు అధికంగా వస్తాయి.
  • తేనె చర్మాన్ని సంరక్షించి మీ అందాన్ని ఇనుమడింపచేస్తుంది. ముఖానికి తేనెతో మాస్క్ వేసుకుంటే మొటిమలు నల్ల మచ్చలు తగ్గుతాయి.
  • నిమ్మరసం కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని మంట, వాపు తగ్గించే లక్షణం చర్మంపై మృతకణాలు తొలగించి ఆరోగ్యంగా కనపడేటట్లు చేస్తుంది. కానీ వీటిని ఎక్కువ సార్లు వాడడం అంత మంచిది కాదు. ఈ రోజుల్లో చాలామంది చర్మం మీద మాయిశ్చరైజర్ ని రాసుకొనేటప్పుడు కొన్ని భాగాలలో ఎక్కువగా మరియు కొన్ని భాగాలలో తక్కువగా రాసుకొంటున్నారు. ఈ అస్థిరత చర్మం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సో, మీ చర్మం మీద అన్ని ప్రాంతాలలో సమానంగా మాయిశ్చరైజర్ ని రాసుకునేలా జాగ్రత్తపడండి.

Leave a Comment