మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో పలువురు జనసేనలోకి చేరారు. వైసీపీ ఎమ్యెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ వారిని జనసేనలోకి ఆహ్వానించారు. 2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఎన్నికల్లో విజయం కోసం జనసేన నాయకులు కష్టపడాలని పిలుపునిచ్చారు.
Janasena: మరి కొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. నాయకులు తమకు నచ్చిన పార్టీల వైపుకు చూస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుసగా గట్టి షాక్‌లు తగులున్నాయి. ఒక్కొకరిగా ఆపార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది జగన్ పార్టీమీద వ్యతిరేకంగా ఉన్నారు. అందులో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వంశీకృష్ణకు కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ యాదవ్‌తో పాటుగా ఆయన అనుచరులు సైతం జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు… వచ్చే ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకమని పవన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. 2014లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ వెంట నడిచిన ప్రతిఒక్కరూ నేడు, జనసేన వైపునకు రావడం ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. వంశీతో తనకు 2009 నుంచే పరిచయం ఉందన్నారు .. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది పవన్ పేర్కొన్నారు.YCP MLC Vamsi Krishna