YS Jagan : జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల రాష్ట్రానికి చేసింది.. కూల్చివేతలతో మెుదలు పెట్టి ..!

By manavaradhi.com

Updated on:

Follow Us

2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా … అంటూ రాష్ట్రం అంతా పాదాయాత్ర చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పిన మాటలను నమ్మి ఎటువంటి పాలనా అనుభవం లేని జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంతో మెుదలైంది ఏపి ప్రజల కష్టాలు.. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ మినహా ఏ వ్యవస్థ పనిచేయడం లేదు. అది కూడా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు అన్న వాదనలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానకు ఆదాయం పెంచడం చేతగాక ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చాక .. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీలు భారీగా పెంచేసారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచారు. చెత్త పన్ను, మంచినీటి పన్ను, మురుగు కాలువల పన్ను, ఖాళీ స్థలాల పన్ను లాంటి 24 రకాల పన్నుల రూపంలో రూ.2 లక్షల కోట్లు భారాలు మోపారు.

రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలనే కొత్త నినాదంతో ప్రజల ముందుకు వైసీపీ రాబోతుంది. జగన్ తరచూ వైనాట్ 175 అంటూన్నారు .. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మళ్ళి మాకొద్దు బాబోయ్ ఈ జగన్ ప్రభుత్వాం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గతంలోనూ మా నమ్మకం నువ్వే జగన్ వైసీపి నేతలు తెగ హడావి చేసారు తర్వాత జగనన్నే మా భవిష్యత్ పేరుతో కార్యక్రమాలను ప్రారంభించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. ప్రతి ఇంటికి బలవంతంగా స్టిక్కర్లు అంటించారు. గడప గడపకు కార్యక్రమంలో ఎక్కడికక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టిగా నిలదీసారు. ప్రజలు ఇచ్చిన అపూర్వ అవకాశాన్ని చెజేతులా నాశనం చేసుకున్నారు.

జగన్ మెహన్ రెడ్డి సీఎం అయిన కాడినుంచి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి అని ఒక్కసారి వెనుక తిరిగి చూస్తే …కూల్చివేతలు మెుదలు పెట్టి, తమ అధికారాన్ని ప్రశ్నించిన వారిని అణచివేతలు, దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, మీడియా, ప్రతిపక్షాల గొంతు నోక్కెందుకు చీకటి చట్టాలు తేవడం లాంటివే కనిపిస్తున్నాయి అంటున్నారు జనాలు.జగన్ వద్దని చెప్పడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. మాట తప్పను మడమ తిప్ననూ అంటూ … ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి యువతను మోసం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేస్తానని మాట తప్పి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

అన్న వస్తున్నాడు… సీపీఎస్ రద్దు చేస్తాడు అంటూ ఉద్యోగులను నమ్మించి చివరకు జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను మోసం చేశారు. 25 మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదాను తెస్తా అంటూ బీరాలు పలికి ఇప్పుడు ఏంచేస్తున్నారు. రైతు భరోసాను 12 వేలు ఇస్తానని ఇప్పుడు కేంద్ర ఇచ్చే వాటితో కలిపి రైతు దగాగా మార్చిలేదా.. అమరావతిని అటకెక్కించి మూడు రాజధానుల ముసుగులో రాజధాని లేని రాష్ట్రంగా మార్చిలేదా..?రివర్స్ టెండరింగ్‌తో సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేయలేదా..?పోలవరం ప్రాజెక్టును ఇంత వరకు పూర్తి చేయ్యలేదు దాని ఊసేలేదు… ఇవన్నీ ఎందుకు చేయ్యలేదు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిలు చేసుకున్నాడు అంటారు.

3 thoughts on “YS Jagan : జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల రాష్ట్రానికి చేసింది.. కూల్చివేతలతో మెుదలు పెట్టి ..!”

  1. కొంపదీసి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని .. జగన్ మూడు రాజధానులు కడతానంటనాడా…

    Reply

Leave a Comment