చంద్రబాబు అరెస్ట్ కు ముందు ఆ తర్వాత మారిన టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ ప్రసంగాలు. 226 రోజుల యువగళం యాత్రలో ఎన్నో కష్టాలను ఎదుర్కోని కోటి మంది ప్రజలతో మమేకం అయ్యారు. యువగళంతో దూకుడు పెంచారు లోకేష్.. గతంలో కాకుండా నేరుగా జగన్ను విమర్శిస్తున్న వైనం చూసి పార్టీ శ్రేణులో నూత ఉత్సహాం వచ్చిందనే చెప్పాలి.
తెలుగు దేశం పార్టీ అధినేత చందబాబునాయుడు అరెస్టుతో కొంత విరామం తీసుకుని అనంతరం ప్రారంభమైన యువగళం రెట్టింపు ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది. దేశ రాజకీయ పాదయాత్రల చరిత్రలో ‘యువగళం’ సువర్ణాక్షర లిఖించారు నారా లోకేష్. యువగళం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట జనగళమైంది. ఒక పక్క తెలుగు దేశం కార్యకర్తలు మరో పక్క సామాన్య జనం సైతం పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా లోకేష్ వెంట జనప్రవాహంలా కదిలారు. అక్రమ కేసులతో తండ్రి అరెస్ట్ … పార్టీ శ్రేణులపై పోలీసు నిర్బంధాలు కోనసాగినా… ఎక్కడ చలించకుండా రోజురోజుకు తన పార్టీని అధికారంలో తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. యువగళంతో సకలజనులు మమేకం అయి తమ మద్దతును తెలిపారు. ముఖ్యంగా నారా లోకేష్ వ్యవహార శైలి, ప్రసంగాల తీరు తెలుగుదేశం పార్టీ వైభవానికి వన్నె తెచ్చే విధంగా ఉన్నాయి. ఆచరణ సాధ్యంకాని హామీలు, మోసపూర్తిత వాగ్దానాల జోలికి పోకుండా వాస్తవిక దృక్పధంతో లోకేష్ ఇస్తున్న హామీలు వర్తమాన రాజకీయ పరిస్తితులలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు అయిందని చెప్పవచ్చు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర దేశ రాజకీయాలలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. విద్యార్ధులు, రైతులు, వృత్తిదారులు, గృహిణి, ఇలా సమాజంలో ప్రతి వర్గాన్నీ పేరు పేరునా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. లోకేష్ పాదయాత్రతో తెలుగుజాతికి కొత్త భరోసా లభించినట్టయింది. యువగళం పాదయాత్ర గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. యువగళం ముగింపు కార్యక్రమానికి చంద్రబాబునాయుడు, సతీమణి నారా భువనేశ్వరి ఇతర కుటుంబసభ్యులతో పాటు పార్టీ నాయకులు అందరూ హాజరైయారు.
ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమయిన యువగళం పాదయాత్ర 226 రోజుల్లో మూడువేల రెండొందల కిలోమీటర్లకు పైగా సాగింది. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ 97 అసెంబ్లి నియోజకవర్గాల పరిధిలో సుమారు రెండువేలకు పైగా గ్రామాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ దాదాపు కోటిమందికి పైగా ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చే హామీలు చరిత్రలో నిలిచిపోయేవిధంగా వున్నాయి. పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీని ఇచ్చారు. ఆయా హామీలకు గుర్తుగా అదే ప్రాంతంలో తాను ఇచ్చిన హామీని గుర్తుచేసేవిధంగా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. పాదయాత్ర సందర్భంగా తొలుత ప్రభుత్వం నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికి ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ సామాన్య ప్రజానీకం కదంతొక్కుతూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయడంతో టీడీపీ యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే ఎన్నికల సమరానికి సై అంటున్నారు.