ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Prithviraj Dulquer Salmaan customs raids

ED Raids : ఇటీవల భూటాన్‌ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్‌ చేశారట. ఈ ఖరీదైన కార్లను ఇండియాలోని సినిమా, బిజినెస్ ప్రముఖులకు అమ్మారన్న సమాచారం రావడంతో దేశ వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేసారు.

సినీ తారల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టికి సంబంధించిన చెన్నైలోని ఆఫీసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహిస్తున్నారు. మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ ఇళ్లపై ఎనిమిది మంది ఈడీ అధికారులు, సిబ్బంది సోదాలు చేస్తున్నారు. కేరళ, చెన్నైల్లోని మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్‌ కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇక ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేశారు. ‘ఆపరేషన్‌ నమకూర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులోభాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్‌ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు.

Leave a Comment