కిడ్నీలు మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను మనం తీసుకోనే కొన్ని ఆహారాలు దెబ్బతీసున్నాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు గురించి తెలుసుకుందాం.
మన శరీరంలో కిడ్నీలు పోషించే పాత్ర ముఖ్యమైనది. ఇవి శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను వడబోస్తాయి. దీంతో రక్తం శుద్ధి అవుతుంది. తద్వారా విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి మనకు ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఎప్పుడూ కిడ్నీలు క్లీన్‌గా ఉంటేనే అవి చక్కగా పనిచేసి మనకు అనారోగ్యం రాకుండా చేస్తాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ మూత్రపిండాల పట్ల జాగ్రత్త వహించాలి. సాధారణంగా మూత్రపిండాలు రక్తం నుంచి యూరియాను తొలగిస్తాయి. ఒకవేళ మూత్రపిండాలు పనిచేయడం తగ్గిపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. అలాగే మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేకుండా ఉంటే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడవచ్చు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనం తీసుకోనే ఆహాలు మన కిడ్నీల పై ఎక్కువ ప్రభావాలన్ని చూపిస్తాయి.
- కిడ్నీలు మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాబట్టి, మూత్రపిండాలు సరిగా పనిచేయడం చాలా అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఫాస్పరస్ మరియు సోడియం లతో నిండి ఉంటాయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వారి ఆహారంలో ఫాస్పరస్ పరిమితం చేయాలి.
- ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, అధిక ఫాస్పరస్ ఆహారాలు తీసుకోవడం మూత్రపిండాలకు ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.అలాగె ఎక్కువగా ఉప్పు తీసుకోడం కూడా కిడ్నీలకు మంచిది కాదు. ఉప్పు అధికమైన ఆహారాలు సోడియంతో నిండి ఉంటాయి, ఇవి రక్తపోటును పెంచుతాయి. మూత్రపిండాలు అధిక ఉప్పును విసర్జించటానికి కష్టపడి పనిచేయటం వలన ఇది మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
- తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయి. మీ శరీరం హైడ్రేట్గా ఉంటే, అది మీ మూత్రపిండాలు శరీరం నుండి మలినాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల రాళ్ళను నివారించడానికి నీటిని తగినంత త్రాగాలి.
- మద్యపానం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు కానీ.. దీనివల్ల కిడ్నీలపైనా ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. కిడ్నీల పనితీరుపై తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది. కిడ్నీలకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది బీపీకి కూడా కారణమవుతుంది. రోజుకి రెండు కంటే ఎక్కువ ఆల్కహాల్ బివరేజెస్ తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కు కారణమవుతుంది. దీనివల్ల కిడ్నీల సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్స్ జరిగే ప్రమాదం ఉంది.
ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల కూడా కిడ్నీల పై చెడు ప్రభావం పడుతుంది. మాంసం తిన్న తర్వాత జంతు ప్రోటీన్ రక్తంలో యాసిడ్ని అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్రపిండాలకు హానికరం మరియు అసిడోసిస్ కు కారణం కావచ్చు.యాసిడోసిస్ అనేది మూత్రపిండాలు వేగంగా యాసిడ్ను తొలగించలేని స్థితి. స్వీట్స్, షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తిడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దాంతో డయాబెటిస్ కు కారణం అవుతుంది. తర్వాత ఈ రెండు కారణాల వల్ల డైరెక్ట్ గా కిడ్నీ ఫంక్షన్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే ఎక్కువగా చాకొలెట్ తినకూడదు. కెఫీన్ ఉన్న టీ, కాఫీ లాంటివి తాగకూడదు. పరిమితిలో తాగితే ఓకే. లేదంటే అవి శరీరంలో ఎక్కువై పోయి తద్వారా కిడ్నీల పనితనంపై ప్రభావం చూపుతాయి. కనుక వీటి వైపు చూడకపోవడమే మంచిది.
రోజుకి 5 నుంచి 6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహై డ్రేషన్కి గురవకుండా చూసుకోవాలి. క్యాబేజి, క్యాలిఫ్లవర్, పాలకూర లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. రక్తపోటు, మధుమేహ బాధితులు వ్యాధిని నియంత్రణలో పెట్టుకుని వ్యాయామం చేయాలి.