Brain Fog : మెదడు పనితీరు మందగించడానికి కారణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By manavaradhi.com

Updated on:

Follow Us

మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే.అలాంటి బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే లేదా అనారోగ్యానికి గురైతే వచ్చే ఇబ్యందులు అన్ని ఇన్నికావు. బాడీలోని ఇతర అవయవాలన్నీ కూడా పనిచేయడం మందగిస్తాయి. బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే, శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది ఓ అనారోగ్య సమస్య కాదు. ఆలోచించే సామర్థ్యాన్ని ప్రబావితం చేసే కొన్ని లక్షణాల సముదాయం. ఈ సమయంలో గందరగోళానికి గురికావడం, అపసవ్యంగా ఆలోచించడం లాంటివి చేస్తారు. సాధారణంగా గర్భధారణ సమయంలో చాలామంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శిశువు పెరుగుదలకు తోడ్పడే రసాయనాల విడుదల శరీరంలో జరుగుతూ ఉంటుంది. దీని వల్ల తల్లికి సమస్యలు ఎదురు కావచ్చు. కొన్ని రకాల మందులు కూడా బ్రెయిన్ ఫాగ్ కు కారణం కావచ్చు. ఈ ఔషధాలు ఒక రకమైన మత్తును కలిగించి, ఆలోచనా శక్తిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి, చికిత్స పొందాలి. ఎలాంటి మందులు తీసుకున్నారనే విషయాన్ని వైద్యునికి తెలియజేయాలి. నొప్పులు తదితర అంశాలకు సంబంధించిన మందులు, వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు.

కీమోథెరఫి ద్వార బలమైన మందులను ఉపయోగించి చేసే క్యాన్సర్ చికిత్స సైతం బ్రెయిన్ ఫాగ్ కు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థతుల్లో పేర్లు, తేదీలు గుర్తుంచుకోవడం కూడా కష్టం అవుతుంది. మెదడు మీద ఒకే సారి ఎక్కువ భారం పడినట్లు అనిపించడం, ఎక్కువ పనులు చేయలేకపోవడం , వస్తువులను గుర్తు పట్టడానికి కూడా సమయం పట్టడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. ఇలాంట సమస్య చాలా త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉన్నా, చికిత్సను ఎక్కువ కాలం పొందితే సమస్య పెరగడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఈ దశలో వారు కొత్తగా నేర్చుకోవడం , గుర్తు పెట్టుకోవడం కష్టమే. సాధారణంగా 50 ఏళ్ళ వయసులో ఈ తరహా సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. వారిలో హృదయ స్పందన రేటు పెరగడం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం లాంటి ఆకస్మిక మార్పులు జరుగుతాయి. హార్మోన్ సప్లిమెంట్స్ మరియు ఇతర మందుల ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చు. క్రానిక్ ఫేటిగ్ సిండ్రోమ్ వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ సమస్య ఎదురు కావడానికి ఆస్కారం ఉంది.

డిప్రెషన్ ఉన్న వారిలో కూడా బ్రెయిన్ ఫాగ్ సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. దీని వల్ల సులభంగా వివిధ అంశాలు గుర్తు పెట్టుకోవడం, సమస్యలు గుర్తించడం లాంటివి చేయలేము. ఓ విధమైన మాంద్యం కారణంగా శరీరం ప్రేరణను కోల్పోతుంది. దీన్ని తెలుసుకోవడం కూడా కష్టమే. మెదడు సరిగా పని చేయాలంటే మంచి నిద్ర అవసరం. నిద్ర లేని వారు బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ఇబ్బంది పడతారు. 7 నుంచి 9 గంటలు నిద్ర పోవడం ద్వారా మంచి విశ్రాంతిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. భోజనం తర్వాత ఆల్కహాల్, కెఫిన్ లాంటి వాటిని నివారించడం, నిద్ర పోయే ముందు కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేయకుండా ఉండడం, స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచడం ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేసే ల్యూపస్ సమస్య కూడా బ్రెయిన్ ఫాగ్ కు కారణం అవుతుంది. వివిధ సమయాల్లో దీని లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. కొంత మందిలో మెదడులో గందరగోళం ఏర్పడితే, మరికొంత మందిలో ఇతర సమస్యలు ఎదురౌతాయి. దీనికి పరిష్కారం లేకపోయినా, వైద్యుని సలహా మేరకు పాటించే జాగ్రత్తలు మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

Leave a Comment