Health Tips : మన ఆరోగ్యానికి, ఇంటి పరిశుభ్రతకు ఉన్న సంబంధం ఏంటి..?

By manavaradhi.com

Updated on:

Follow Us

మన ఆరోగ్యం మన ఇల్లు … ఇంటి లోని వస్తువుల శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో… మనమూ అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉద్యోగం, వ్యాపారం అంటూ ఇంటిపై దృష్టి సారించకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. అసలు ఇంతకీ మన ఆరోగ్యానికి, ఇంటికి ఉన్నసంబంధం ఏంటి..? ఇంటిని మరియు ఇంటిలోని వస్తువులను ఎలా శుభ్రంగా పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలం..?

  • ఇంట్లోకి సరిగ్గా గాలి వచ్చే విధంగా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.. ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి పోతుంది. అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని.. వీటివల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. అదే విధంగా మనం వాడే ఫిల్టర్లు కూడా ఎక్కువ రోజులైన తర్వాత వాటిని మార్చుకోవాలి.

వంటగది పరిశుభ్రతే ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా కాపాడుతుంది. కాబట్టి, వంటగదిలోని టవల్స్‌, స్పాంజ్‌లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. స్టౌవ్ ఉంచిన ఫ్లోర్‌తో పాటు స్టౌవ్‌పై మరకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వాటిని రోజులతరబడి వాడితే మీతో బ్యాక్టీరియానూ ఉంచుకున్నట్లేన‌ని మ‌రిచిపోవ‌ద్దు. ట‌వ‌ల్స్‌తోపాటు వంట‌గ‌దిలోనే మూల‌కు ఉండే సింక్‌ను కూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల అనారోగ్యానికి గుర‌య్యే సూక్ష్మ‌క్రిములు చేర‌కుండా చూసుకోవ‌చ్చు.

ఇంట్లో వేర్వేరు వ్యక్తులు చాలా తరచుగా టెలివిజన్‌ను ఉపయోగిస్తారు. దాంతో ఇది సూక్ష్మజీవుల నిలయంగా మారుతుంది. మన ఇంట్లో తరచుగా తాకే ప్రదేశాలలో తలుపు హ్యాండిల్స్‌ ముఖ్యమైనవి. అందుకే ఇవి సూక్ష్మక్రిములకు నెలవుగా మారతాయి. ఇంటి లోపల బ్యాక్టీరియా వ్యాప్తికి తలుపు హ్యాండిళ్లే కారణమని వైద్యులు కూడా ధృవీకరించారు. అందుకే ప్రతి మూడు, నాలుగు రోజులకోసారి క్రిమిసంహారక ద్రావణంతో తలుపు హ్యాండిల్స్‌ను తుడిచివేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇక అలంకరణ వస్తువులు విషయానికి వస్తే.. ముఖ సౌందర్యాలకు మెరుగులద్దడానికి ఉపయోగించే మేకప్ బ్రష్ ల వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.. లేదంటే చర్మం సమస్యలు బాధించే ప్రమాదం ఉంటుంది.

ఇంటి శుభ్రత ఇంట్లోని మనుషుల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అందులో నివసించే వారూ అంతే ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది దేనినైనా సరే వారానికోసారి సెలవు రోజుల్లో చేద్దామని నిర్లక్ష్యంగా వదిలేస్తారు.. అది సరికాదు. అన్ని వస్తువులూ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం లేకపోయినా..? కొన్ని వస్తువుల్ని మాత్రం ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. చాలామంది వారానికోసారి దుమ్ము దులుపుదామని అనుకుంటారు. కానీ దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపారు వంటివి ఉపయోగించడానికి అసహ్యం అనిపిస్తాయి. అంతేకాదు దానిపై చేరిన దుమ్ము అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకే ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపడం చాలా అవసరం. బెడ్స్‌ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి.

  • బెడ్‌షీట్‌ దులపటం, ముడతలు లేకుండా చేయటం, తలగడలు సరి చేయటం, రాత్రివేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టడం వంటివి తప్పకుండా చేయాలి.
  • రాత్రి పడుకునే సమయంలో శుభ్రపరచిన బెడ్‌ పై పడుకోవటం మానసికంగానూ, శారీరకంగానూ ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది.
  • ఇంటి పరిశుభ్రతలో మరొకటి ఫ్లోరింగ్‌. ఇంట్లోకీ బయటకూ నడుస్తుంటాము, గాలి, వెలుతురు కోసం, విండోలను తెరచి ఉంచుతాం. అటువంటప్పుడు, దుమ్మూధూళీ ఫ్లోర్‌ మీద పడి, అది తినే ఆహారాలపై, మనం వేసుకునే దుస్తులపై పడి, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. కాబట్టి, ఫ్లోర్‌ క్లీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి. ఇది ఇంటిసభ్యుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇళ్లు, ఇంట్లోని పరిశుభ్రత కూడా ముఖ్యమైనదేనని తెల్సుకోవాలి. దానికనుగుణంగా ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment