ప్రస్తుత తరుణంలో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలుగా మారిపోతున్నాయి. దీనికి కారణం సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం వలన బరువు పెరిగిపోతున్నారు. ఒక్కసారి బరువు పెరిగిన తరువాత తగ్గడం చాలా కష్టమైనపని. . అయితే శరీరంలో కొవ్వు కరిగించే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే.. బరువు పెరగకుండా.. కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు… మరీ కొవ్వును కరిగించే ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవడానికి గంటల తరబడీ జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ..అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా అధనంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలతో పోరాడటానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కొవ్వును కరిగించే కొన్ని ప్రభావవంతమైన ఆహరాలు ఉన్నాయి. అవి కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే శరీరంలో.. నడుం చుట్టూ పేరుకొన్న అధనపు కొవ్వు ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సిట్రస్ పండ్లు మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధించడం మాత్రమే కాదు, శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచుతుంది. సిట్రస్ పండ్లలో నిల్వ ఉండే విటమిన్ సి అందుకు బాగా సహకరించడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. తాజా పండ్లను నారింజ,బత్తాయి వంటివి తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు.
కొవ్వు కరిగించుకొని పొట్టతగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఓల్ గ్రైన్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గ్రైన్స్ వల్ల శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గాంచుకోవచ్చు. అవకాడోలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
రకరకాల రూపాల్లో లభించే బీన్స్ తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గించుకోవచ్చు. కొవ్వు పదార్థాలను కరిగించుకోవచ్చు. యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది. గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే అంశం కలిగి ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతుంది. వీటిని తిన్న 15నిముషాలకే క్యాలరీలను కరిగిస్తుంది. అల్లం జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేసి అదనపు కొవ్వును కరిగిస్తుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సమర్ధవంతగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బరువు పెరగకుండా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది, మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు సులభతరం చేస్తుంది. చేపల్లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ ను కలిగి ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. బరువు తగ్గకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు తమ ఒంటిలో ఉన్న కొవ్వును కరిగించుకోవాడాని నిత్యం వీటి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వార కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చు.