Food poisoning : ఫుడ్‌ పాయిజనింగ్‌ ఎందుకు అవుతుంది ?

By manavaradhi.com

Published on:

Follow Us
Symptoms and Treatments of Food Poisoning

ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా మనం తీసుకోనే ఆహారం ద్వారానే జరుగుతుంది. సరిగ్గా వండుకోకపోయినా.. లేదా పచ్చి ఆహార పదార్ధాలు తీసుకున్నా వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు శరీరానికి తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ కొన్ని సార్లు ప్రాణాంతకమైనది కూడా. అటువంటప్పుడు, ఏ ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తాయి… దీనికి ఇంకా ఇతర కారణాలు ఏంటి..?

ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎక్కువగా మనం తీసుకునే ఆహారం నుంచి సంభవిస్తుంది. కలుషితమైన, పాడైపోయిన, విషాహారమును తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. అనే రకాల రోగకారక క్రిములనేవి మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ ఉంటాయి. అయితే, వండుకునేటప్పుడు ఇవి నశిస్తాయి. ,అందువలన, పచ్చివాటిని ఆహారంగా తీసుకోకూడదనే నియమం వచ్చింది. మాంసం, పాల ఉత్పత్తులు అలాగే గుడ్లు అనేవి తరచూ కలుషితమవుతూ ఉంటాయి. కాబట్టి, వీటిని జాగ్రత్తగా శుద్ధి చేసి ఆ తరువాత ఉడకబెట్టుకుని తినాలి. వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, చిన్నపాటి జ్వరం, బలహీనత, తలనొప్పి వంటివి ఫుడ్ పాయిజనింగ్ కు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిని చికిత్స తీసుకోవాలి.

గుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా పొంచి ఉంటుంది. ఈ బాక్టీరియా వలన గుడ్లు కలుషితమవుతాయి. కోడి గుడ్లను పొదగడానికి అలాగే షెల్స్ అనేవి తెరచుకోవడానికి ముందే ఇలా జరుగుతుంది. కాబట్టి, వాటిని బాగా ఉడకపెట్టడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ ను అరికట్టవచ్చు.పౌల్ట్రీ చికెన్ తో పాటు గ్రౌండ్ బీఫ్ ని సరైన విధానంలో తీసుకోకపోతే వీటిద్వారా ఫుడ్ పాయిజనింగ్ సంభవించే ప్రమాదం కలదు. శ్టఫ్ మరియు సాల్మొనెల్లా బాక్టీరియా ద్వారా మాంసం అనేది కలుషితమవుతుంది. అందుకే సరిగ్గా ఉడకని మాంసాన్ని తీసుకోకూడదు. మాంసాన్ని సరిగ్గా ఉడికించిన తరువాతే ఆహారంగా స్వీకరించాలి. స్కామ్బ్రోటాక్సిన్ వలన ట్యూనా ఫిష్ అనేది కలుషితమవుతుంది. దీని వలన తలనొప్పులు అలాగే ఒళ్ళు నొప్పులు సంభవిస్తాయి.

ట్యూనా ఫిష్ ను పట్టిన తరువాత 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే, వండినా కూడా నశింపబడని విషపదార్థం అనేది విడుదలవుతుంది. అందుకే, తాజా ఫిష్ ను ప్రిఫర్ చేయాలి. ఈ కొలి బ్యాక్టీరియా పళ్ల రసాలు, పచ్చి పాలలోనూ ఉండే అవకాశం ఉంది. అందుకే పాలను పాశ్చరైజ్ చేయాలి లేదా మరగబెట్టాలి. పచ్చి పాలు తీసుకోవడం మంచిది కాదు. మనకు గ్రాసరీ స్టోర్ లో ప్యాక్ చేసి ఉంచే పళ్లరసాలను చాలా వరకు పాశ్చరైజ్ చేస్తారు. కాబట్టి వాటి వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు…ఈ మధ్య చాలా మంది శాండ్ విచ్ లు , సలాడ్స్, పేస్ట్రీలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఐతే ఇవి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటి ద్వారా స్టఫ్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. స్టఫ్ ఇన్ఫెక్షన్ సోకితే.. కడుపులో తిమ్మిర్లు వాంతులు, విరేచనాలు అవుతాయి. అందుకే చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఆహారాన్ని ముట్టుకోవాలి.

కొన్ని రకాల వైరస్ లు మరియు బ్యాక్టీరియాలు కూడా శుభ్రత పాటించకపోవడం వల్లే వస్తుంది. వైరస్ ఉన్న వ్యక్తి.. ఆహారం ముట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల ఇది సోకే అవకాశం ఉంది. గర్భిణీగా ఉన్నవారు, వృద్ధులు , పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో సరిగ్గా ఉడకని వంటకాలు తినవద్దు. ఎందుకంటే వారిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పాశ్చరైజింగ్ చేసిన డైరీ ఉత్పత్తులనే తీసుకోవడం మంచిది. ఆహారాన్ని ముట్టుకునే ముందే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కూరగాయలు, మాంసాన్ని తరిగే వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కూరగాయలను మంచి నీటితో శుభ్రంగా కడగాలి.అలాగే క్యాబేజీ లాంటి వాటిని పైన ఉన్న లేయర్ తీసేసి వండుకుంటే మంచిది. మాంసం, కూరగాయలు ఏవైనా .. కచ్చితంగా అవి ఉడికే ఉష్ణోగ్రత వరకు ఉంచాలి. పూర్తిగా ఉడికిన తర్వాతే తినడం మంచిది. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడవచ్చు.

కాబట్టి మనం తినే ఆహార పదార్ధాలు ఇన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ లతో నిండి ఉంటాయి. కాబట్టి సరిగ్గా వండిన ఆహారం తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడవచ్చు.

Leave a Comment