Care after 40 – 40 ఏళ్ల వయసులోకి వచ్చారా – ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!

By manavaradhi.com

Published on:

Follow Us
Manage Stress

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి, శ్రమ ఒత్తిడులను తట్టుకునే సామర్ధ్యం తగ్గుతుంటాయి. అంతకుముందు ఆరోగ్యవిషయంలో చేసిన నిర్లక్ష్యం, అలవాట్లు, వ్యసనాలు వంటివి కూడా వయసు పెరిగినప్పుడు అవి మనపై ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా నాలుగు పదులు వయసు దాటిన నాటినుంచి అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరీ అలాంటప్పుడు 40 ఏళ్ళు పైబడినవారు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి..?

మన వయసు రోజురోజుకి పెరుగుతుంటే, ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల 40 ఏళ్ళు తాటుతున్నా ఆరోగ్యంగా జీవించవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి.

రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేసే వారికి ఇది అత్యంత ఆవశ్యకం.

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి,ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. ఆయుష్షును పెంచుకుని ఆరోగ్యంగా జీవించాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలి.

కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

వయసుపెరిగేకొద్దీ తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం.

పొగ తాగడం లాంటి అలవాట్లకు చెక్ పెట్టాలి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. వయసు పెరిగే కొలదీ గుండే విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు.

ఆరోగ్యం, అనారోగ్యం ఏదీ ఒక్కరోజులో వచ్చేది కాదు.. పోయేది కాదు. మెుదటి నుంచే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 40 ప్లస్‌ వయసు తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Leave a Comment