PM Mementos auction: పీఎం మెమెంటోస్‌ వేలం గడువు పొడిగింపు

By manavaradhi.com

Published on:

Follow Us
PM Mementos auction

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్‌’ 8వ విడత ఆన్‌లైన్‌ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

ఈ ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం 30 రకాల బహుమతులు, జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ కళాకృతులు, స్మారక చిహ్నాల నమూనాలు ఉన్నాయి. కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా వేలంలో ఉంది. దీనికి రూ.10 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు.

అలాగే జగన్నాథ పరివార రథం ప్రతిమ ఈ వేలంలో అత్యధిక ప్రారంభ ధర కలిగిన జ్ఞాపికగా నిలిచింది. దీనికి రూ.21 లక్షల బేస్‌ ప్రైస్‌ నిర్ణయించారు.

వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నమామి గంగే’ కార్యక్రమానికి విరాళంగా అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజలు ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొని తమకు నచ్చిన జ్ఞాపికలపై బిడ్లు దాఖలు చేయవచ్చు.

Leave a Comment