Heart Health: గుమ్మడితో.. గుండె సమస్యలు దూరమవుతాయా..?

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits of Pumpkin

మనం నిత్యం అనేక రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటాం. వాటిల్లో అనేక రకములైన పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిల్లో గుమ్మడికాయ ఒకటి. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యను తగ్గించడంలో గుమ్మడికాయ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలో పీచు పదార్దము ఎక్కువగా ఉండటం వలన అధిక కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

అత్యధిక పోషకవిలువలు కలిగిన గుమ్మడికాయల్లో కొలెస్ట్రాల్, సోడియం మరియు కొవ్వులలో తక్కువగా ఉంటాయి. క్రమంగా శరీరానికి సరైన మోతాదులో పోషకాలను అందివ్వడమే కాకుండా, ఊబకాయం తగ్గించడంలో కూడా అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

గుమ్మడికాయలను వాటి గుజ్జు, విత్తనాలు మరియు విత్తనాల నూనెల కోసం ఉపయోగిస్తారు. అంతే కాదు ఆరోగ్యకరమైన స్నాక్స్ లా కూడా గుమ్మడికాయను నేరుగా తీసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ నిల్వలు, ఆకలిని అదుపులో ఉంచుతుంది. క్రమంగా ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా నిరోధిస్తూ, బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గుమ్మడి కాయలో మనకు ఎక్కవ మోతాదులో ఫైబర్ లభిస్తుంది. బరువు తగ్గడంలో ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది. మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతుంది.

  • గుమ్మడి గుండెకు ఎంతోమేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్ సీ గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి.
  • పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాదు ఎముక సాంద్రత దృఢపడుతుంది.
  • మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
  • గుమ్మడి తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది.
  • వీటిలోని విటమిన్ ఏ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది.
  • విటమిన్ సీ శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
  • గుమ్మడిలో ఉండే బీటా కెరొటినా మన చర్మంపై పడే సూర్యకిరణాల ప్రభావం పడకుండా సహజసిద్ధంగా సన్‌ బ్లాక్‌గా పనిచేస్తుంది.
  • గుమ్మడికాయలో పొటాషియం నిల్వల ఉనికి ఎక్కువగా ఉంటుంది, క్రమంగా వ్యాయామం తర్వాత కండరాల విశ్రాంతికి మరియు పునర్నిర్మించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
  • గుమ్మడిలో జింక్, విటమిన్ సి ఉండటం వల్ల కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది.
  • గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
  • ఇందులో చాల ఎక్కువగా ల‌భించే బీటా కెరోటిన్ శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది.
  • కంటి ఆరోగ్యానికి గుమ్మడి ఎంతగానో సహాయపడుతుంది.
  • ఇందు లభించే విటమిన్స్ కంటిచూపు మెరుగుప‌డటానికి దోహదం చెస్తాయి.
  • కంటి సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
  • తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడటం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుమ్మడి కాయలే కాదు… వీటి గింజల వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుమ్మడి గింజలు శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

శరీరానికి మంచి ఆరోగ్యప్రయోజనాలు కలిగించే వాటిలో గుమ్మడి కాయ కూడా ఒకటి. కాబట్టి నేటి నుంచి గుమ్మడిని తగిన మోతాదులో తీసుకోండి గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకొండి.

Leave a Comment