Crohn’s disease – క్రాన్స్ వ్యాధి పేగులో సంభవించే జీర్ణ సంబంధ సమస్య

By manavaradhi.com

Published on:

Follow Us
Crohn's disease - Symptoms and causes

మన తిన్న ఆహారం జీర్ణం అయ్యి, శరీరానికి పోషణ అందడంలో పేగుల పాత్ర ఎనలేనిది. కారణాలు ఏవైనా కొన్ని రకాల సమస్యల కారణంగా నోటి నుంచి పాయువు వరకూ క్రోన్స్ వ్యాధి చుట్టు ముడుతోంది. భారతదేశంలో ఎక్కువగా ఉన్న ఈ సమస్య వల్ల పేగుల్లో మంట విపరీతంగా బాధిస్తుంది.

క్రాన్స్ వ్యాధి పేగులో సంభవించే జీర్ణ సంబంధ సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య నేడు రోజురోజుకీ పెరుగుతోంది. క్రాన్స్ వ్యాధి లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. ఈ సమస్య రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి…స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్,షుగర్, ఆల్కహాల్, కెఫీన్ లాంటి ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య రావడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. అంతేకాదు గర్భ నిరోధక మాత్రలు, యాంటీబయాటిక్ మందులు ఎక్కువగా వాడటం, తీవ్రమైన ఒత్తిడి, పొగ తాగడం, జన్యుపరమైన సమస్యలు, నాన్ స్టిరాయిడల్ మందుల వాడకం వల్ల కూడా క్రాన్స్ సమస్య పెరుగుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇవేకాక కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయని, పారిశ్రామిక ప్రదేశాల్లో, పట్టణాల్లో నివసించే వారిలో కూడా ఈ క్రాన్స్ వ్యాధి సోకే అవకాశాలున్నాయని అంటున్నారు వైద్యులు.

గట్ సహజంగా బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది, కానీ క్రోన్ ఉన్నవారిలో వారి సమతుల్యత ఉండదు. ప్రోబయోటిక్స్ సహాయక సూక్ష్మక్రిములను జోడించడం ద్వారా ఆ సమతుల్యతను పునరుద్ధరించవచ్చు. పెరుగు వంటి ఆహారాలలో వాటిని పొందవచ్చు. అంతేకాదు ప్రోబయోటిక్ టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆహారాలలో సహజ ప్రీబయోటిక్స్ ఉన్నాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థలో పెరుగుతున్న సహాయక బ్యాక్టీరియాకు ఇంధనాన్ని అందిస్తాయి. అరటి, ఉల్లిపాయలు, ఆస్పరాగస్ మరియు ఆకుకూరలలో వాటిని పొందవచ్చు.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంటతో కూడిన అనేక ఆరోగ్య సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తాయి. సాల్మన్, మాకేరెల్ మరియు హెర్రింగ్ వంటి కొవ్వు చేపలను తినడం ద్వారా వాటిని పొందవచ్చు. అవి మాత్ర రూపంలో కూడా లభిస్తాయి. వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో వీటి తీసుకోవచ్చు.

క్రాన్స్ సమస్య ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా ఇబ్బందిపెడుతుంది. జీర్ణ వ్యవస్థలో వేరు వేరు వ్యక్తుల్లో వేరువేరు భాగాల్లో కనిపిస్తుంది. క్రాన్స్ వ్యాధి ద్వారా చిన్న ప్రేగు మరియు పెద్దప్రేగు చివరి భాగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ జీవనశైలిలో మార్పులు అంటే డెయిరీ ఉత్పత్తులను తగ్గించడం,చక్కెర శాతం ఎక్కువ లేకుండా చూసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తపడటం, ప్రాసెస్ మరియు ప్యాకేజ్ చేసిన ఆహారపదార్థాలను పూర్తిగా తగ్గించడం, ప్రీ బయాటిక్ మరియు ప్రొబయాటిక్ ఆహారాన్ని ఎక్కువగా తినడం, ఆల్కహాల్, కెఫీన్ కు స్వస్తి చెప్పడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ఈ సమస్య నుంచి బయటపడగలుగుతున్నారు. కాబట్టి క్రాన్స్ సమస్యకు సంబంధిన్న లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని సరైన మందులు వాడితే సుఖవంతమైన , ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు.

ప్రధానంగా ఆహారంలో సరైన విధమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ తరహా ఎన్నో సమస్యలను రాకుండా కాపాడుకుని, మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

Leave a Comment