Lung Health : ఈ ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి

By manavaradhi.com

Published on:

Follow Us
lung health foods

ఊపిరితిత్తులు మన శ్వాసక్రియకు ఎంతో కీలకం. ఎందుకంటే… శ్వాస తీసుకోవడం క్షణం ఆలస్యం జరిగినా ప్రమాదమే. శరీరం కోసం ఎలాంటి వ్యామాయాలు, యోగాలు చేస్తారో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి… అలాగే ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులను నివారించడంలో పోషకాహారం పాత్ర ముఖ్యమైనది.

బయట పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు ఎలాంటి వ్యాధులు రాకుండా, ఆహారం లో మార్పులు చేసుకోవడం ద్వారా లంగ్స్ ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. కాలుష్యం యొక్క హానికరమైన ప్రభావాలను సమతుల్యం చేయడంలో మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది… ముఖ్యంగా ఎక్కువగా మొక్కలు నుంచి లభించే ఆహారాలు తీసుకుంటూ… తక్కవ ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటే మంచిది.

క్రుసిఫెరూస్ కూరగాయలు ఊపిరితిత్తులకు ఉత్తమ మరియు సమర్థవంతమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ఈ కూరగాయలలో క్యాబేజీ, బ్రోకలీ, టర్నిప్ క్యాబేజీ ఉన్నాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి అన్ని రకాల విషాలను తొలగించి నిర్విషీకరణ చేస్తుంది. ఈ కూరగాయలను సలాడ్ రూపంలో కూడా మనం నిత్యం తీసుకోవచ్చు.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం ఏంటి..?

  • టమోటోలు మన రోజువారీ ఆహారాల్లో తప్పనిసరిగా ఉపయోగించే కూరగాయ, అంతే కాదు, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి గొప్పది, ఎందుకంటే వీటిలో ఉండే అనేక అంశాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. టొమాటాలు శ్వాసకోశ వాయుమార్గాలలో శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది, తద్వారా, ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ రుగ్మతలు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • తృణధాన్యాలు ఊపిరితిత్తులును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
  • బ్రౌన్ రైస్, గోధుమలు, వోట్స్, క్వినోవా మరియు బార్లీ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫైబర్ అధికంగా ఉండే ధాన్యపు ఆహారాలు మాత్రమే కాదు… వీటిలో విటమిన్ ఇ, సెలీనియం,ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచివి.
  • బెర్రీస్ ఒక అద్భుతమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి … ఊపిరితిత్తులను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. బెర్రీస్ లో అన్ని రకాల బెర్రీస్ ఆరోగ్యానికి మంచివే.
  • ఆకుకూరల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది లంగ్స్ హల్త్ కు రక్షణ కల్పిస్తుంది. ఆకు కూరలతో తయారు చేసిన వంటలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
  • ఆకు కూరల్లోని మొత్తం ప్రయోజనాలను పొందాంటే మీరు ఆకుకూరలతో తయారుచేసిన సలాడ్స్ లేదా సూప్ లను భోజనం సమయంలో తీసుకోవడం మంచిది.
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి..?

సరైన ఆహారంతోపాటు కెఫిన్ లేని పానీయాలు .. శ్వాస నాళాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంచుతాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. ఇందుకోసం కాఫీ కాకుండా పాలు తాగాలి. పాలల్లో ఉండే క్యాల్షియం , విటమిన్ D వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పాలు, మిల్క్ షేక్ లతోపాటు యోగర్ట్ కూడా తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అంతమంచిది కాదు.

సాధారణంగా రోజుకు 1,500 నుండి 2,300 మి.గ్రాముల ఉప్పు మనకు సరిపోతుంది. ఉప్పును అధిక మోతాదులో వినియోగిస్తే … అది మన ఊపిరితిత్తులు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి మితంగా వాడడం మంచిది. అలాగే ధూమపపానం , మధ్యపానం లాంటివి లంగ్స్ కి మంచిదికాదు.. వీటి వల్ల ఎక్కువ హాని కలుగుతుంది.. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉంటే మంచిది.

ఊపిరితిత్తుల మీద ఆహార ప్రభావం ఉంటుంది. కాలుష్యం ప్రభావం పడకుండా ఆహారంలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. అప్పుడే మన మొత్తం శరీరానికి సపోర్ట్ గా ఉండే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.

Leave a Comment