Health Tips: పుచ్చకాయను తినండి… హైబీపీని తగ్గించుకోండి

By manavaradhi.com

Updated on:

Follow Us
Watermelon Can Help You Control High Blood Pressure

ప్రస్తుతం అందరి చూపు పుచ్చపండ్ల మీదికి మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి, చూడగానే నోరూరించే వీటిల్లో నీటిశాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకూ నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరొటిన్, విటమిన్‌ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి.అంతేకాదు పుచ్చకాయలో మనకు పొటాషియం కూడా తగినంతగా లభిస్తుంది.. దీని ద్వారా బీపీ అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

ప్రస్తుత మనం ఉన్న ప్రపంచంలో ఏదో ఒక కారణం చేత ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతున్నాడు. శరీరంలోని ర‌క్తనాళాల గోడ‌లపై ర‌క్తం క‌లిగించే పీడ‌నం నిరంత‌రం ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెష‌ర్ అంటారు. బ్లడ్ ప్రెషర్ 140/90 క‌న్నా ఎక్కువగా ఉంటే అప్పుడు హైబీపీ ఉందని చెబుతారు. ఎప్పుడైనా 180/90 ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే హైబీపీ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడానికి మ‌నం నిత్యం తీసుకునే ఆహారం పట్ల నియమాలు పాటించాలి.

అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే ఆహారం విష‌యానికి వ‌స్తే బీపీని కంట్రోల్ చేసేందుకు మ‌న‌కు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ కూడా ఒక‌టి. పుచ్చకాయలు మనకు వేసవి కాలంలో విరివిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల హైబీపీ తగ్గుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. పుచ్చకాయలో ఉండే పలు ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయట.

పుచ్చకాయతో బీపిని తగ్గించుకోవచ్చా….?

పుచ్చ‌కాయ‌ దాహార్తిని తీర్చడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను అందిస్తుంది.ఇందులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖ‌నిజాలు ఇందులో అధికంగా ల‌భిస్తాయి. పుచ్చపండు గుజ్జు, తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది న్రైటిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విప్పారతాయి.తద్వారా అవయవాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది.

పుచ్చకాయలో పొటాషియం ఎక్కవగా లభిస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందువల్ల పొటాషియం తగినంతగా లభించాలంటే పుచ్చపండు తింటే సరి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేలా చేసుకోవచ్చు. మరోవైపు దీనిలోని లైకోపేన్‌ గుండెజబ్బు ముప్పు తగ్గటానికీ తోడ్పడుతుంది. పుచ్చపండు తేలికగా జీర్ణమవుతుంది. మంచి పిండి పదార్థాలు సైతం ఉండటం వల్ల తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల నీరసం, నిస్సత్తువ వంటివి వెంటనే తగ్గుతాయి. మానసికంగానూ మంచి హుషారు, ఉత్సాహం చేకూరుతాయి.

పుచ్చకాయ వల్ల కలిగే ఇతర ఆరోగ్యప్రయోజనాలు…?

ఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యవరాలు. అందుక‌ని ఏ సీజ‌న్‌లో దొరికే పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవ‌డం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు. అలాగే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ఇచ్చే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తీసుకోవ‌డం చాలా మంచిది. పుచ్చకాయలో ప్రోటీన్, కొవ్వు, సోడియం తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సన్‌బర్న్‌ను నివారించడంలో గొప్పగా సాయపడుతుంది. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది.

వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. పుచ్చకాయ జ్యూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది. ఎండల వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా రక్షిస్తుంది. వీటిలోని విటమిన్ బి6 నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపర్చి, బీపీని అదుపులో ఉంచుతుంది.

పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.అధిక రక్తపోటున్నవారు పుచ్చకాయలను ఎక్కువగా తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Leave a Comment