Health Tips: నీళ్లు తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Drinking Water Wrong

మన శరీరంలో అన్నీ వ్యవస్థలు సరిగ్గా పనిచేయలంటే నీరు ఎంతో కీలకం. ఈ నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయటంతో పాటు మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్లగొడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీరు తాగితే మంచిది. ఇది శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. జీవక్రియ విధానాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

ఉదయం టిఫిన్‌ చేశాక 30 నిమిషాల తర్వాత నీరు తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించటానికి సహాయపడుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందే నీటిని తాగాలి. ఇది జీర్ణ రసాలను డైల్యూట్‌ చేస్తుంది. భోజనం చేసిన గంట తరువాత ఓ గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇది జీర్ణప్రక్రియను వేగవంతం చేసి పోషకాలు తొందరగా గ్రహించటానికి సహాయపడుతుంది. అలాగే. రాత్రి భోజనానికి రెండు గంటల ముందుగానే నీటిని తాగాలి. దీనివల్ల జీవక్రియ ప్రక్రియ వేగవంతంగా పనిచేసి పోషకాలను గ్రహించటం జరుగుతుంది. అలాగే నిద్ర పోవటానికి ఓ గంట ముందు గ్లాస్ నీళ్ళు తాగటం మంచిది.

నదులు లేదా ప్రవాహాల నుండి తాగడం మంచిది కాదు. సహజ నీటి వనరులు స్పష్టంగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి, కానీ అనేక విషయాలు వాటిని కలుషితం చేస్తాయి. ఇందులో విషపూరిత మొక్కలు, జంతువుల మూత్రవిసర్జన మరియు మలం మరియు అక్రమ రసాయన డంపింగ్ ఉన్నాయి. తాగే ముందు సహజ నీటిని వడపోత మాత్రలు లేదా నీటి ఫిల్టర్‌ చేసి తాగితే మంచిది.

నీళ్ళు తాగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ?

రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయాన్నే ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. ఇలా ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవచ్చు.భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగితే ఇబ్బందేమీ లేదు గానీ మరీ ఎక్కువగా తాగకూడదు. ఇది జీర్ణరసాలను పలుచగా చేసి జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది.టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగటం మేలు.

Leave a Comment