laser dentistry – దంత సమస్యలున్నాయా.. ఈ ట్రీట్‌మెంట్ చేయించుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
laser dentistry

మన ముఖసౌంధర్యంలో దంతాల పరిశుభ్రత వాటి తెల్లదనం ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి మనలో ఆత్మ విశ్వాసాన్ని కూడా నింపుతాయి. మరి అలాంటి దంతాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే దంతాలకు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవాలి.

దంతాలు లేదా పళ్ళు దవడలకు అమర్చబడి ఉంటాయి. వీటి యొక్క మొదలు బాగాలు చిగుళ్లతో కప్పబడి ఉంటాయి. మానవునిలో రెండు జతల దంతాలు ఉంటాయి. పాల దంతాలు, శాశ్వత దంతాలు .దంతాలు డెంటిన్ అనే పదార్థంతో నిర్మించబడి ఉంటాయి. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతం లోపల ఉండే కుహరంలో రక్తనాళాలు, నాడీ తంతువులు ఉంటాయి. ప్రతీ రోజు మనం దంతాల సహాయంతో ఆహారపదార్థాలను తీసుకుంటాము. ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపర్చుకోకపోతే దంతాల మద్యలో ఆహార పదార్థాలు చిక్కుకొనిపోయి దంతాలపై గార ఏర్పడుతుంది. పళ్లపైన ఏర్పడే సూక్ష్మజీవులనే (ఫ్లేక్ ) గార అంటారు. ఇది ఒకరకమైన సూక్ష్మజీవి కాబట్టి ఆహారం తిన్న వెంటనే దంతాలను నోటిని శుభ్రపర్చుకోవాలి. లేకపోతే దంతక్షయం వంటి సమస్యలు మొదలౌతాయి.

చాలామంది దగ్గరగా ఎవరితో మాట్లాడాలన్నా భయపడతారు కారణం నోటి దుర్వాసన. దీనికి ప్రధాన కారణం దంత సమస్య, పుచ్చిపోయిన పళ్ళు, కదులుతున్న దంతాలు, సగం విరిగిన పళ్ళు, నొప్పిపెట్టే పళ్ళుంటే నోరు వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకే తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఎంత కేర్ తీసుకున్నా నోరు వాసన వేస్తుంటే డాక్టర్ వద్దకు వెళ్ళి కారణాలను తెలుసుకుని మందులు వాడాలి. ఎందుకంటే దంత సమస్యలు ఎంతో బాధతో కూడినవి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంతవైధ్యులను సంప్రదించి దంతాలను క్లీనింగ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన దంత సమస్యల నుండి బయటపడవచ్చు.

దంత సమస్యలకు చికిత్సలో బాగంగా కఠినమైన మెత్తని కణజాలాలకు లేజర్ ట్రీట్ మెంట్ చేస్తారు. ఈ లేజర్ యంత్రాలలో పలు రకాల దంత సమస్యలకు చికిత్సను అందించే విధంగా ముందుగానే ఆ సమస్యలకు సంబందించిన ప్రోగ్రామ్ లు తయారు చేయబడి ఉంటాయి.మెత్తని కణజాల చికిత్సలో ఉన్న ఎండోడాంటిక్స్ అనే ప్రోగ్రామ్ ని ఉపయోగించి రూట్ కెనాల్ ను చేస్తారు. దీని ద్వారా బాగా లోతుగా ఉన్న ఇన్ఫెక్షన్ ని తగ్గించవచ్చు ఈ ట్రీట్ మెంట్ ద్వారా పంటిని గాని, చిగుళ్లనిగాని ఎముకను గాని అవసరమైన మేరకు కత్తిరించవచ్చు. చాలామందికి పన్ను పైభాగం అరిగిపోయి మంచినీరు తాగినా జీవ్వున లాగుతుంది. దీనిని కూడా లేజర్ చికిత్స ద్వారా తగ్గిస్తారు.

అధిక రక్తపోటుతో మూర్ఛతో బాద పడే వాళ్ళకు చిగుళ్ళు వాచినప్పుడు ఎక్కువగా ఉన్న చిగుళ్లను కూడా లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కత్తిరిస్తారు. దంతాల అమరికలో ఎత్తుపళ్ళాలు ఉండటంతో క్రమంగా పళ్లలో కణతులు ఏర్పడే అవకాశాలున్నాయి. పళ్ళు పుచ్చిపోతాయి. ఈ విధంగా జరగకుండా కణతులు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ఫిట్ అండ్ లేజర్ సీలింగ్ పద్దతిలో మూసివేస్తారు. ఈ విధంగా లేజర్ కిరణాలలో పన్నునే కాదు ఎముకను కూడా కట్ చేయవచ్చు. ఇంకా ఫ్లోరోసిస్ వల్ల పళ్ల మీద పసుపుపచ్చని పొర ఏర్పడితే దానిని కూడా తొలగించవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సిటివ్ నెస్ ఎక్కువగా ఉంటే లేజర్ కిరణాలతో ఆ భాగాన్ని డీసెన్సిటివ్ చేయవచ్చు.

కొంతమందిలో దంతాలు పసుపుపచ్చగా కనిపిస్తుంటాయి. దీనికి తోడు దంతాలపై గట్టి పదార్థం పేరుకుపోయినట్టుగా కనిపిస్తుంది. దీనినే “సెలుక్యూలోస్” అంటారు. సాధారణ బాషలో గార పట్టడం అంటారు. ఇది దంతాలపై గట్టి పొరగా మారి దంత సమస్యలకు కారణమౌతుంది. ఇది ఉన్నప్పుడు పళ్ళు తోముకునే సమయంలో చిగుళ్ళ నుంచి రక్తం కారడం కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…

  • రోజు మంచి బ్రష్, పేస్టుతో పళ్ళు తోముకోవాలి.
  • మౌత్ వాష్ తో పుక్కిలించి వేయాలి.
  • ప్రతి రోజు పడుకునే ముందు ఫ్లోరైడ్ ఉన్న పేస్టుతో బ్రష్ చేసుకోవాలి.
  • దంత సమస్య రాగానే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
  • సహజసిద్దంగా దంత సంరక్షణలో బాగంగా ఉపయోగపడే జామ, యాపిల్, కారేట్ మొదలైనవి ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
  • ఇంకా వయసు పెరుగుతున్న కొద్ది వృద్దుల్లో దంత సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వీరు దంతాలు, చిగుళ్ళ శుభ్రతను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Comment