అందమైన ముఖాన్ని చూపేది అందమైన నవ్వు. మరి ఆ నవ్వు హాయిగా నవ్వడానికి అందమైన పలు వరుస కావాలి. తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి. మరి మన దంతాలనూ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో అవగాహన తప్పని సరి.
మన దంతాలు ఆరోగ్యంగా ఉంటే మాట్లాడేటపుడు, నవ్వినపుడు ఎదుటివారికి మనపై మంచి భావన కలుగుతుంది. ఎవరికైనా పుచ్చిపోయిన దంతాలు, విరిగిన పళ్ళు, దంతాలు ఉడిపోవటం, పంటి మరియు చిగుళ్ళ నొప్పులు, గారపట్టిన పళ్ళు లాంటి సమస్యలు ఉంటే చూసేవారికి అసహ్యంగా ఉంటుంది. దీంతోపాటు వీటివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ముఖానికి అందాన్నిచ్చే దంతసిరిని కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకోవాలి. చిన్నవారికయినా, పెద్దవాళ్లకయినా దంత సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల దంతాల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం తల్లితండ్రుల బాధ్యత. రాత్రిళ్ళు పాలు లేదా తేనే వంటి ఆహర పదార్థాలను తీసుకున్న తరువాత అలానే పడుకోనివ్వకూడదు. ఫలితంగా, దంతాలు అనారోగ్యానికి గురవుతాయి.
కొవ్వు తక్కువగా ఉన్నా పాలు, యొగ్ హార్ట్, చీస్ వంటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వాలి. చక్కెరలేని చూయింగ్ గమ్స్ నమలటం వలన లాలాజలం అధికంగా ఉత్పత్తి చెంది, ఆమ్ల గాడతలను తగ్గిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు మరియు టీ వంటివి చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దంతాలు, ఎక్కువ చక్కెర పదార్థాలకు బహిర్గతపరచటం వలన ఎనామిల్ పొర పాడవుతుంది. చక్కెర అధికంగా ఉన్న ఆహర పదార్థాలను తిన్న తరువాత వెంటనే పళ్ళను నీటితో కడగాలి. దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న తరువాత దంతాలను కడగటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలూ అందితే దంతాలు దృఢంగా ఉండాలంటే అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
దంతాలకు ఫాస్పరస్ అందడం వల్ల కూడా దంతాలు దృఢపడతాయి. మాంసం, చేపలు తినడం మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది.. పళ్లపై ఉండే ఎనామిల్ పొర గట్టిపడుతుంది. వీటితోపాటు పాల పదార్థాలు తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా దంతాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎనామిల్ పూత పోకుండా సహాయపడతాయి. అలాగే కొవ్వు తక్కువగా ఉన్న చీజ్ ఎంచుకోవాలి. అలానే వెన్నలేని పాలతో చేసిన పెరుగు తినాలి. క్యాల్షియం ఎక్కువగా ఉండే గుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. ఇది దంతాలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం వల్ల దంతాలతోపాటు, ఎముకలూ బలంగా మారతాయి.
క్యారెట్, యాపిల్ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి అవుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి. అంతేకాదు.. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి రక్షించేందుకు కూడా బలమైన దంతాలు కావాలి. దంతాల పైన ఉండే ఎనామిల్ పొరను పాడుచేసి దంతాలలో క్యావిటిలను కలుగచేసి వాటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అప్పుడు ఫ్లోరైడ్ చికిత్స చేయించుకోవడం వలన ఎనామిల్ పొర తిరిగి ఏర్పడుతుంది. పిల్లలకు 15 సంవత్సరాలు వచ్చే వరకు, ప్రతి సంవత్సరం ఫ్లోరైడ్ చికిత్స చేయించడం మంచిది. అందుకే వైద్యుల సలహా తీసుకుంటూ నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా బావుంటుంది.