Asthma – పిల్లికూతలు, ఆయాసం ఉంటే ఆస్తమా వచ్చినట్టేనా…?

By manavaradhi.com

Published on:

Follow Us
Prevention of asthma

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిన్న పిల్లలు మొదలుకుని ముసలి వారి వరకూ ఈ వ్యాధి… వయసుతో సంబంధం లేకుండా ప్రభావం చూపుతోంది. గాలి ఊపిరితిత్తులలోకి ప్రవహించేటప్పుడు మ్యూకస్ ముంబ్రెన్ బ్రాంకైల్ మ్యూకోస్ అనే పలచటి పొరగుండా ప్రయాణిస్తున్నప్పుడు… ఆ పొరకు చిరాకు పెట్టించే చర్య జరిగినప్పుడు ఆస్తమా ఏర్పడుతుంది. సాధారణంగా పల్చగా, ఊదా రంగులో ఉండే ఈ పొర ఆస్తమాకు గురైనప్పుడు ఉబ్బిపోయి ఎర్రగా మారుతుంది. గాలి ప్రయాణించే మార్గంలోని కండరాలు ముడుచుకుపోయి ఈ మార్గాన్ని మరింత సన్నగా చేస్తాయి. దీనివల్ల దగ్గు, ముక్కు కారడం, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల్లోని, పట్టణ ప్రాంతాల్లో ఆస్తమా వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. పట్టణ వాతవరణ కాలుష్యమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి.

ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యుసంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఈ వ్యాధి కలగడానికి సాధారణంగా దుమ్ము, పొగ, చల్లని ద్రవాలు, కూల్ డ్రింక్స్, వాతావరణంలోని మార్పులు మొదలైన వాటి వల్ల ఆస్తమా ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయుల సంబంధించిన కొన్ని సంప్రదాయాలు ఆస్తమాకు కారణం అవుతాయి. ఆహారధాన్యాల రవాణా, శుభ్రం చేయడం, పాత పుస్తకాలు, ఫైల్స్, న్యూస్ పేపర్ల నిర్వహణ, అల్మరాల్లో దుమ్ము దులపడం, బూజు దులపడం, కొత్తగా వేసిన పెయిండట్స్, యాసిడ్ తో బాత్ రూంలను శుభ్రం చేయడం, దోమల నివారణకు ఉపయోగించే మ్యాట్స్, కాయిల్స్ మొదలైనవి ఆస్తమాను త్వరగా ప్రేరేపిస్తాయి. ఇలాంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

రచూ జలుబు చేస్తుండడం, త్వరగా తగ్గకపోవడం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కచ్చితంగా ఆస్తమా పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రాత్రిళ్ళు నిద్రలో ఇబ్బందులు ఏర్పడ్డం లాంటివి ఇందులో ప్రధానమైన అంశాలు. ఇలాంటి ఆస్తమా లక్షణాలను వ్యాధి నిర్థారణళో భాగంగా పరిగణలోనికి తీసుకోవడమే కాకుండా, కంప్యూటర్ ద్వారా లంగ్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తద్వారా డాక్టర్ చికిత్సకు సంబంధించి సరైన మందులు ఎంచుకోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలే కలిగినటువంటి ఇతర సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిలో ఏది అనే విషయాన్ని నిర్థారించుకోవడానికి ఆస్తమా పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

ఆస్తమా వచ్చిందని తెలిసినప్పటు కచ్చితంగా మందులు వాడడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఆస్తమాను తగ్గించే మందులతో పాటు… అదుపులో ఉంచే మందులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏవి వాడినా డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందులతో పాటు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఆస్తమా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

  • చక్కటి ప్రభావం కోసం స్పెసర్‌ పరికరాన్ని ఉపయోగించవచ్చు.
  • స్పెసర్‌ పరికరాన్ని నోటితో ఊదిన ప్రతిసారి లోతైన శ్వాస తీసుకోవడం తప్పనిసరి.
  • రెండు నిమిషాల వ్యవధి తీసుకుంటూ మరలా మరలా ఉదుతూ ఉండాలి.
  • ఉపశమనంకు సంబంధించిన మందులు వాడేటట్లయితే, నివారణ మందులకన్నా ముందు వీటినే ఉపయోగించాలి. రెండింటికీ మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి.
  • నివారణ ఇన్‌హేలర్‌ను ఉపయోగించినట్లయితే నోటిని, గొంతును శుభ్రం చేసుకోవాలి.
  • వారానికి ఒకసారి స్పెస్‌ పరికరాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేసి మూత క్రిందకు వచ్చేట్టుగా ఒక శుభ్రమైన టవల్‌ మీద ఆరబెట్టాలి. వాటిని బట్టతో తుడవడం లాంటివి చేయకూడదు.

ఆస్తమా వచ్చిన వారు చల్లని ఆహారం, పానీయలు తీసుకోవడం చేయకూడదు. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్, కృత్రిమ రంగులతో చేసిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాయామంతో పాటు స్విమ్మింగ్, షటిల్, 40 నిముషాల పాటు తేలికపాటి నడక వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో వాడిని మందుల తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు డాక్టర్ కు తెలియజేస్తూ… ఆస్తమా నుంచి పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు.

Leave a Comment