Blepharitis – బ్లెఫరైటిస్ అంటే ఏంటి…? ఈ సమస్యతో దృష్టిలోపాలు వస్తాయా…?

By manavaradhi.com

Published on:

Follow Us
Blepharitis

కేవలం తెల్లగా ఉండటం మాత్రమే కాదు. ముఖంలోని అన్ని భాగాలు కూడా అందంగా కనిపించినప్పుడే ఎవరైనా ఆకర్శణీయంగా కనిపిస్తారు. ఇలా ఆకర్శణీయంగా కనపడాలంటే ముఖంలో తీర్చిదిద్దుకోవాల్సిన భాగాలు బాగానే ఉన్నాయి. అలాంటి భాగాల్లో చెప్పుకోదగినవి… కనురెప్పలు…. వాటిపై ఉండే వెంట్రుకలు. ఈ వెంట్రుకలు ఎంత దట్టంగా నిండుగా ఉంటే కంటిపాప కూడా అంత అందంగా కనిపిస్తుంది. ముఖానికి అందాన్నిచ్చే కనురెప్పలకు సమస్యలు వస్తే… ఏం చేయాలి…?

కంటి అందాన్ని ఇనుమడింపజేసేవి… కనుబొమ్మలు, కనురెప్పలు. శరీరం ఎంత తెల్లగా ఉన్నా కంటి రెప్పలు చక్కగా అమరిలేకపోతే… అంధవికారంగా కనిపిస్తారు. కనురెప్పలపై ఉండే వెంట్రుకలు రాలిపోవడం, ఎర్రగా మారి వాచిపోతుండటం అప్పుడప్పుడు కనిపిస్తుంది. దీనినే బ్లేఫారైటిస్ అని పిలుస్తారు. బ్లెఫరైటిస్ సమస్య కారణంగా విసుగు, దురద, కళ్లు ఎర్రబడినట్లుగా ఉంటుంది. మనిషిని ఒక పట్టాన కూర్చోనివ్వకుండా చేస్తుంది. తరచూ కళ్లు నలుచుకునేలా చేస్తుంది. కళ్లు ఎర్రగా వాచిపోవడంతో ఏపనీ చేయాలన్నా ఇంట్రస్ట్ అనిపించదు. అంతలా మనల్ని ఇబ్బంది పెట్టే బ్లెఫరైటిస్ సమస్యను దీర్ఘకాలం పాటు అశ్రద్ధ చేయడం కూడా మంచిది కాదు.

కళ్లకు వచ్చే బ్లెఫరైటిస్ రెండు రకాలుగా కనిపిస్తుంది. స్టాఫిలోకోకై బ్యాక్టీరియా కారణంగా కంటిరెప్పల ముందరి భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను ఆంటీరియర్ లేదా స్టాఫిలోకోకల్ బ్లెఫరైటిస్ గా… మెబోమియన్ గ్రంథులు పనిచేయకపోవడం కారణంగా పోస్టీరియర్ బ్లెఫరైటిస్ సమస్యలు వస్తాయి. ఇది సాధారణంగా అలెర్జీలు వల్ల గానీ కొన్నిసార్లు బాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా కనురెప్పల చమురు గ్రంథులు బ్లాక్ అవడం వల్ల గానీ కలుగుతుంది. మొటిమల రూపంలో ముక్కు, నుదురు, బుగ్గల మీద సాధారణంగా వ్యాపించే చర్మ వ్యాధి, హెర్పెస్ సింప్లెక్స్ చర్మశోథ, ఆటలమ్మ వ్యాధి-జోస్టర్ చర్మశోథ, కను రెప్ప మీద లేచిన చీముగడ్డ, అలెర్జిక్ డెర్మటైటిస్, సోబోర్హెయిక్ డెర్మటైటిస్, స్టెఫిలోకాకల్ డెర్మటైటిస్ మరియు పరాన్నజీవి సంక్రమణలు వంటి వాటి కారణంగా బ్లేఫారైటిస్ వ్యాధికి దారితీస్తుంది.

బ్లెఫరైటిస్ సమస్య వచ్చినప్పుడు కళ్లు నీటితో నిండి వున్నట్లుగా కనిపిస్తాయి. అదేవిధంగా కనురెప్పలు పూర్తిగా వాచిపోయి ఎర్రటి రంగులో మారుతాయి.

  • కనురెప్ప అంచుల వద్ద బాహ్య పొరలో మార్పు
  • అభ్యంతరకర కనురెప్ప
  • కనురెప్ప దురద
  • కనురెప్పల చర్మం పెచ్చడం
  • కంటిలో నలుసు పడి మంటగా అనిపించడం
  • కనురెప్పలు జిడ్డుగా మారడం
  • తరచుగా కనురెప్పలు కొట్టుకోవడం
  • కాంతి అంటే భయపడటం
  • రెప్పవెంట్రుకలు పోవడం
  • సేబాషియస్ గ్రంధులకు ఇన్‌ఫెక్షన్ వచ్చి వెంట్రుకలు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బ్లెఫరైటిస్ కారణంగా కంటి చూపు మందగించడం గానీ, పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం గానీ లేదు. అయితే ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కంటి చూపు మందగించడంపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ట్రీట్్మెంట్ తీసుకోవడం ఆలస్యం జరిగిన పక్షంలో కంటి కింది భాగంలో మచ్చలు ఏర్పడుతాయి. అలాగే కంటి నుంచి నీరు అదేగా కారడం, కాంటాక్ట్ లెన్స్ వినియోగంలో ఇబ్బంది, కనురెప్పల బేస్ వద్ద ఇన్‌ఫెక్షన్, కండ్ల కలక, కెరటైటిస్, కార్నియా అల్సర్లు రావడానికి ఆస్కారముంటుంది. కనురెప్పలు ఎరుపు రంగులో మారి అల్సరేటీవ్‌కు దారితీసే అవకాశంతో పాటు చికిత్స అందని ప్రాంతం నుంచి రక్తం కారే ప్రమాదముంది.

బ్లేఫారైటిస్ సమస్య కారణంగా దృష్టి మసకబారుతుంది. నురుగు, బుడగలతో కూడిన నీరు కంటి నుంచి కారుతుంది. కళ్లు, కంటిరెప్పలను భౌతికంగా పరీక్షించడం ద్వారా వైద్యులు సమస్య తీవ్రతను పరిగణిస్తారు. కొన్నిసార్లు మాత్రమే స్పెసిమిన్ మెటీరియల్్ను బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ పరీక్షల కోసం పంపుతారు.

బ్లెఫరైటిస్ సమస్య కనపడగానే అనునిత్యం చల్లటి నీటితో కంటి భాగాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా బ్లేఫారైటిస్ సమస్యను నిరోధించుకోవచ్చు. ప్రతిరోజు 30 సెకండ్ల పాటు రెండు కంటిరెప్పలను చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. చికాకు కల్పించనటువంటి సబ్బులు గానీ ఫేస్ వాషింగ్ లోషన్స్ గానీ వాడటం ఉత్తమం. కంటి రెప్పల వెంట్రుక‌ల‌ను సంర‌క్షించే శ‌క్తి ఆముదం నూనెకు ఉంది. కొద్దిగా నూనెను చిన్నపాటి బ్రషతో తీసుకుని దాంతో క‌నురెప్పలపై సున్నితంగా రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. అనంత‌రం వాటిని తెల్లారాక క‌డిగేయాలి. దీంతో క‌నురెప్పల వెంట్రుక‌లు ద‌ట్టంగా పెరుగుతాయి. అలాగే బాదం నూనెను క‌నురెప్పలపై మర్ధనం చేస్తే… అక్కడి వెంట్రుక‌ల‌కు ఆరోగ్యం కలిగి ద‌ట్టంగా పెరుగుతాయి. మేక‌ప్ ఎక్కువ‌గా వేసుకునే వారు రాత్రి పూట దాన్ని తీసివేయ‌డ‌మే మంచిది. విట‌మిన్లు, మిన‌రల్స్ ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను భుజించాలి. క‌నురెప్పల వెంట్రుక‌ల‌ను చ‌క్కని బ్రష్‌తో నిత్యం దువ్వుకుంటే అవి ఇంకా ఆక‌ర్షణ‌ను సొంతం చేసుకుంటాయి. క‌ళ్లను ఎక్కువ‌గా న‌ల‌ప‌డం వల్ల క‌నురెప్పలు స‌హ‌జ ఆకృతిని కోల్పోతాయి. క‌ళ్లు మూసుకుని నిత్యం కొంత సేపు మ‌సాజ్ చేయాలి.

Leave a Comment