Vitamin D -విటమిన్ డి పొందాలంటే ఏం చేయాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Vitamin D: Benefits, Sources, Deficiencies

సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. తర్వాత దీన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే క్యాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. విటమిన్ డి భర్తీకి సప్లిమెంట్లు వేసుకునే బదులుగా ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా విటమిన్ డి ఎండ ద్వారా లభిస్తుంది. ఎండతో పాటు కొన్ని ఆహారాలను చేర్చుకుంటే మంచిది. ఆయిలీ ఫిష్ – సాల్మన్, ట్రాట్, ట్యూనా, మ్యాకెరల్ వంటి సముద్రపు చేపల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. తాజా చేపలు లభించని పక్షంలో క్యాన్లలో లభించే ట్యూనా, సొర చేపలు తీసుకున్నా ఫలితం ఉంటుంది.

పాలల్లో చాలా వరకు విటమిన్-డి ఫార్టిఫైడ్ ఉంటున్నా యి. ప్రతి రోజు గ్లాసు చొప్పున పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా విటమిన్-డిని పొందవచ్చు. గుడ్డులోని పచ్చసొనను ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు. కాని దీంట్లో నుంచి విటమిన్లు, మినరల్స్, విటమిన్-డి కూడా అధికంగా లభిస్తుంది. గుడ్డులో విటమిన్-డి తో పాటు పొటాషియం, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి-12, విటమిన్ బి-6, క్యాల్షియం, ఐరన్ లభిస్తాయి. సూర్యకాంతిలో రోజూ ఉదయం కొంత సేపు ఉంటే మనకు అందుతుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం.

శరీరంలో విటమిన్ డి లోపం వల్ల మానసిక స్థితిలో తేడా ఏర్పడడం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడా రావడం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరగడం, హృదయ, మూత్రపిండాల జబ్బులు వంటివి వచ్చే అవకాశాలున్నాయి. మహిళల్లో మెనోపాజ్ తరువాత సహజంగానే శరీరం క్యాల్షియంను శోషించుకోదు. విటమిన్ డి లోపం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. క్యాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇన్సులిన్పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం. నిత్యం సూర్యకాంతిలో కొంత సేపు ఉండడం లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విటమిన్ను పొంది తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

కొందరికి తరుచూ కాళ్లు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నడుం మొత్తం కూడా పట్టేస్తూ ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. అయితే ఇది డి విటమిన్ లోపం వల్లే వస్తుంది. దీంతో బాగా నీరసానికి గురవుతారు. కేవలం మహిళల్లలోనే కాకుండా పురుషుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అయితే యవ్వనంలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సి ఫెరాల్ అనే ఆసిడ్ ఉంటుంది. అది లోపిస్తే సమస్యల బారినపడతాం. కాబట్టి మనకు సూర్యకాంతి అందేలా చూసుకోవాలి.

శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం.

Leave a Comment