ఆర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాలు, వెన్ను, మణికట్టు, చేతివేళ్లు మొదలైన అవయవ కండరాలపై, వాటి జాయిoట్స్ పై ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణాన శరీర కదలికలు కష్టతరమవుతాయి. ఈ పరిస్థితి ఎక్కువగా 60 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. రాను రాను తీవ్రమవుతూ ఉంటుంది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
కీళ్లు వాపులకు గురై బాగా నొప్పి ఉండే స్థితినే ఆర్థరైటిస్ అంటారు. వయస్సు మీద పడిన వారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. కీళ్లలో ఏర్పడే వాపులు నొప్పికి దారి తీస్తాయి. దీంతో చెప్పరాని బాధ కలుగుతుంది. ఆర్థరైటిస్‌లో రెండు రకాలున్నాయి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ కాగా మరొకటి రుమటాయిడ్ ఆర్ురైటిస్. శరీరంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోవటం వలన కాళ్లు, చేతులు, మోచేతులు, కీళ్లు దెబ్బ తింటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌ను కీళ్లవాతం అని అంటారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో లోపం వలనే కీళ్లవాతం వస్తుంది. దీని వలన జాయింట్లో నొప్పి, వాపుతోపాటు కీళ్ల కదలిక కష్టమవుతుంది. శరీరంలో ఉన్న కొన్ని కణాల జాయింట్లలో ఉన్న ఆరోగ్య కణాలపై దాడి చేస్తుంటాయి. జాయింట్‌లోని కార్డిలేజ్ను దెబ్బతీయంటం, శరీరంలోని రక్షణ వ్యవస్థపై కొన్ని కణాలు దాడితో రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది.
ఏ తరహా ఆర్థరైటిస్ సమస్య వచ్చినా సరే జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ మంచి పోషకాహారాలను నిత్యం తీసుకుంటే ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ తో భాదపడేవారు రోజువారి ఆహారంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలి. ఇవి ఆర్థరైటిస్ ను అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే సోయా బీన్, చియా సీడ్స్ ను తీసుకున్నా ఆర్థరైటిస్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

వాల్ నట్స్ శరీరంలో మెటబాలిజంను చాలా వేగంగా మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి.
ఆలివ్ నూనె నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందేందుకు ఎంతగానో ఉపయోగాపడుతుంది. ఇది కీళ్లనొప్పులను సడలిస్తుంది, బలమైన వాపులు కలిగిన ప్రదేశానికి చైతన్యాన్ని కలుగజేసి మెరుగుపరుస్తుంది. ఆలివ్ నూనెను వాడటం వల్ల ఆర్థరైటిస్ వంటి రుగ్మతలను తగ్గిస్తుంది.మొలకెత్తిన గింజలు, క్యాబేజీ, బ్రకొలితోపాటు తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆర్థరైటిస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
బోన్స్ సూప్ ను తాగడం వల్ల కూడా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే డయలిల్ డై సల్ఫైడ్ అనే సమ్మేళనం టుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల నిత్యం వెల్లుల్లిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ ఆర్థరైటిస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువల్ల నిత్యం పసుపును ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య నుంచి బయట పడవచ్చు. రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌కు జీవితకాలం చికిత్స తీసుకోవాలి. కీళ్లవాతం వచ్చిన రోగులు రుమటాలజీ స్పెషలిస్టు సలహాపై మందులు వాడాలి. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించు కోవటంతోపాటు ప్రతినిత్యం మందులు వాడుతూ ఫిజియోథెరపిస్టు సలహాపై వ్యాయామం చేయాలి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక రుగ్మత.కానీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ…సక్రమంగా మందులు వాడుతూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తే ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు.