పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగాసినిమాలో నటించిన ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్ రాజ్ ఇందులో సత్యదాదా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది.
సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఓజీ’ రూపొందుతోంది. ఇందులో పవన్ (Pawan Kalyan) ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని పాత్రలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియాంకా మోహన్ నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్. శ్రియారెడ్డి, అర్జున్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.