Allari Naresh : మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. హీరో నిఖిల్ (Nikhil Siddhartha) కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే ఈ కథను ముందుగా నరేశ్ కు చెప్పాడంట చందు. కానీ ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చుట్టూ కథ ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ పాములు ఉండటం ఇందులో కీలకం.
అయితే వ్యక్తిగతంగా నరేశ్ కు పాములంటే భయం. అందుకే ఈ సినిమా కథను వద్దనుకున్నాడంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు నరేశ్. ఇలా వద్దనడంతో చేసేది లేక అదే కథను నిఖిల్ కు చెప్పడం.. అతను కూడా వెంటనే ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. రిజల్ట్ ఏంటో మనం చూశాం. అది పాన్ ఇండియా మూవీ సిరీస్ గా మారి.. నిఖిల్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఒకవేళ అదే కథ నరేశ్ చేసి ఉంటే అతని కెరీర్ కు మంచి బూస్ట్ అయి ఉండేది. కానీ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు నరేశ్.
2014 అక్టోబరు 14న విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందింది. ‘కార్తికేయ’ పార్ట్ 2 నిఖిల్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఒకవేళ అల్లరి నరేశ్ ‘కార్తికేయ’లో నటించి ఉంటే అప్పటి నుంచే ఆయన సీరియస్ కథల్లో కనిపించేవారేమో. సీరియస్ లుక్‌లో ప్రేక్షకులు తనని అంగీకరిస్తారా, లేదా? అనే సందేహానికి ‘మహర్షి’ చిత్రంలో పోషించిన రవిశంకర్ పాత్ర జవాబుగా నిలిచిందని, ఆ క్యారెక్టరే పవర్ఫుల్ స్టోరీల్లో నటించేందుకు ధైర్యాన్నిచ్చిందని నరేశ్ మరో సందర్భంలోనూ పంచుకున్నారు.వరుసగా యాక్షన్ తరహా సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా కామెడీ సినిమాలూ చేస్తుంటానని చెప్పారు.










