ఎస్‌బీఐలో 541 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అర్హత ఉంటే సరిపోతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ముంబయి రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు
- మేనేజర్: 06
- డిప్యూటీ మేనేజర్: 03
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 10
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎంలో ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 8వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 35 నుంచి 45 ఏళ్లు, మేనేజర్‌కు 24 నుంచి 36 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.64,820 – రూ.1,35,020.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 8.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 28.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
Official Website – https://sbi.bank.in/web/careers/current-openings










