స్కూల్కు వెళ్లాల్సి వస్తుందన్న బాధతో చిన్నపిల్లలు కడుపునొప్పి అని డ్రామాలు అడటం మనకందరికీ తెలిసిందే. అయితే చాలా మందిలో కూడా కడుపునొప్పి సర్వసాధారణంగా వస్తుంటుంది. కొన్ని కడుపునొప్పులకు కారణాలు కూడా ఉండవు. అసలింతకీ కడుపునొప్పి ఎందుకు వస్తుంది..? కడుపునొప్పి వచ్చిన సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి ఒకటి. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వారి వరకూ ఏ వయస్సు వారికైనా కడపునొప్పి ఏదో ఒక సమయంలో వస్తుంది. కొంత మందిలో అకస్మాత్తుగా కడుపు నొప్పి బాధిస్తుంటుంది. అసలు పొట్టలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఉదరంలో లేదా పొట్ట క్రింద బాగంలో ఇలా వివిధ రకాలుగా కడుపు నొప్పి బాధిస్తుంది. కడుపునొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావటంగా చెబుతారు. కొన్ని సార్లు నొప్పి వచ్చిన చోటనే ఉండి పోవచ్చు. మరికొన్ని సార్లు ఈ నొప్పి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించవచ్చు. కాలేయం, క్లోమంలో ఇన్ఫెక్షన్ వచ్చినా, వాపు వచ్చినా, రక్తప్రసారానికి అంతరాయం ఏర్పడినా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కడుపునొప్పి ఏదో ఒక సందర్భంలో వస్తే మామూలు నొప్పిగా భావించాలి. అదే నొప్పి తరుచుగా వస్తే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.
పొట్ట ఉదర భాగంలో ఏ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకినా ఇది పొట్టనొప్పికి దారితీస్తుంది. స్పైసీ ఫుడ్స్,జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఫ్రెష్ గా ఉన్న ఆహారాలు కాకుండా చెడిపోయిన ఆహారాలు తినడం మొదలగునవి కడుపు నొప్పికి కారణమవుతాయి. సరైన సమయానికి భోజం చేయకపోవడం, పానీయాలు, కాలుష్యం ఇలా వివిధ రకాలుగా పొట్టనొప్పికి కారణమవుతాయి. కడుపునొప్పి రావడానికి ప్రధానంగా అజీర్తి, ఎసిడిటి, మలబద్దకం, ఫుడ్ అలర్జీ, పొట్టలో గ్యాస్, ఫుడ్ పాయిజన్, అల్సర్ , ప్రేగులో అపెండిసైటిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ వంటివి కారణాలుగా వైద్య నిపుణులు పేర్కొంటారు.
పొట్టలో నొప్పి అనిపించినప్పుడు జ్వరం, వాంతి, పొట్ట తిమ్మెర్లుగా, పొట్టలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాతాయి . యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చిన సందర్భాల్లో, క్రోన్స్ వ్యాధి వచ్చినప్పుడు, హెర్నియాకు గురైనప్పుడు, ఎండోమెట్రియోసిస్, అపండిసైటిస్ వచ్చినప్పుడు కూడా కడుపులో నొప్పి కనిపిస్తుంది. మహిళల్లో నెలసరి సమయాల్లో కూడా తీవ్రమైన కడుపునొప్పి బాధిస్తుంటుంది. అలాగే అండాశయ తిత్తులు, ఫైబ్రాయిడ్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి, ఎక్టోపిక్ గర్భం వచ్చిన సందర్భాల్లో కూడా కడుపునొప్పి కనిపిస్తుంది.
బయట తినే ఆహారాల వల్ల అమిబియాసిస్ వ్యాధి సంక్రమించి కడుపునొప్పి వస్తుంది. అందుకని బయటి ఆహారాలు తినడం మానుకోవాలి. పొట్ట నొప్పికి ఎట్టి పరిస్థితిలో సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు. పొట్ట నొప్పికి సూచించే యాంటీ బయోటిక్స్ ట్రీట్మెంట్ కోర్స్ పూర్తి అయ్యే వరకూ యాంటీబయోటిక్స్ కు తీసుకోవాలి. కడుపునొప్పిగా ఉన్నా ఆహారం తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, మసాలా ఆహారాలను దూరంగా ఉంచాలి. పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. కడుపునొప్పి తీవ్రంగా ఉన్నా, తరుచూ నొప్పి బాధిస్తున్నా, జ్వరం ఎక్కువగా ఉండి కడుపునొప్పిగా ఉన్నా, రెండు రోజులకు మించి ఆహారం తీసుకోలేనప్పుడు, మలంలో రక్తం పడినప్పుడు, రక్తపువాంతులు చేసుకొన్నప్పుడు, కళ్లు, చర్మం పసుపురంగులోకి మారిన సందర్భాల్లో, మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉంటే, తరుచూ మూత్రానికి వెళ్లాల్సివస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
పొట్టనొప్పితో పాటు ఇతర లక్షణాలు జ్వరం వంటి లక్షనాలు కనబడినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం. కడుపునొప్పిగా ఉన్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం చాలా ఉత్తమం.







