The Family Man Season 3 : ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్

By manavaradhi.com

Published on:

Follow Us
The Family Man Season 3

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడవ సీజన్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇప్పటికే రెండు సీజన్లు విశేష ఆదరణ దక్కించుకోగా ఇప్పుడు మూడో సీజన్ (The Family Man S3 Trailer) అలరించేందుకు సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే దీన్ని రూపొందించారు. నవంబర్‌ 21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.

మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా కనిపిస్తున్నాడు, కానీ ఈసారి అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పరారీలో ఉంటున్నాడు. కొత్త సీజన్‌లో జైదీప్ అహ్లావత్ భయంకరమైన డ్రగ్ మాఫియా డాన్‌గా విలన్ అవతారంలో, నిమ్రత్ కౌర్ మరో మాస్టర్‌మైండ్‌ గా పరిచయం అయ్యారు. శ్రీకాంత్ తన కుటుంబాన్ని కాపాడటానికి, దేశాన్ని రక్షించడానికి వివిధ సవాళ్లను ఎదుర్కొంటాడు. షరీబ్ హష్మి, ప్రియమణి, ఆష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్ వంటి ముఖ్య నటీనటులు కూడా తిరిగి కనిపిస్తున్నారు.

Leave a Comment