NABARD | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు

By manavaradhi.com

Published on:

Follow Us
NABARD Assistant Manager Grade A Recruitment 2025

NABARD Assistant Manager Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన NABARD (National Bank for Agriculture and Rural Development) సంస్థలో Assistant Manager Grade ‘A’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్, వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి రంగం పై ఆసక్తి ఉన్న యువతకు మంచి అవకాశం. దరఖాస్తులు 08 నవంబర్ 2025 నుండి 30 నవంబర్ 2025 వరకూ స్వీకరించబడతాయి. ఎంపిక Prelims, Mains, Psychometric Test మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

పోస్టుల సంఖ్య: 91.

పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్​మెంట్ బ్యాంకింగ్ సర్వీస్– ఆర్​బీడీఎస్) 85, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్) 02, అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్) 04.

ఎలిజిబిలిటీ
అసిస్టెంట్ మేనేజర్ ( ఆర్ బీడీఎస్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ/ సీఏ/ సీఎస్/ ఐసీఏఐ/ మేనేజ్​మెంట్​లో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్): కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్సులో కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ కలిగిన కమిషన్డ్ ఆఫీసర్ అయి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 08.

లాస్ట్ డేట్: నవంబర్ 30.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150. ఇతరులకు రూ.850.

సెలక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు www.nabard.org వెబ్ సైట్ లో సంప్రదించగలరు.

Leave a Comment