ప్రస్తుతం మనకు మార్కెట్లో చేపలు విరివిగా లభిస్తున్నాయి. వీటివల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. ఈ చేపలను ఆహారం రూపంలో కానీ, సప్లిమెంట్స్ రూపంలో కానీ తీసుకున్నా కానీ మనకు ఎన్నో లాభాలునాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే చేప నూనె ద్వారా ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ఎక్కువ శాతం లభిస్తాయి. ఇది అనేకరకాల అనారోగ్య లక్షణాలను, అనారోగ్యాలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహాకరిస్తాయి
చేపలు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల ఈ చేపలను మనం తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. అదేవిధంగా చేప నూనెల వల్ల కూడా మనకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సార్డిన్ మరియు అన్కోవిస్ చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటుంది. మిగిలిన 70 శాతం ఖనిజాలతో, పోషకాలతో నిండి ఉంటుంది. కాబట్టి చేపని ఆరోగ్య ప్రదాయినిగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా షార్క్, స్కేట్ మొదలైన చేపల కాలేయం నుంచి తీసే నూనెల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం వారానికి ఒకటి, రెండు చేపలు తినాలి. అప్పుడే శరీరానికి కావల్సిన ఒమేగా ఫ్యాటి యాసిడ్స్ లభిస్తాయి. చేపలు తినడానికి ఇష్టపడని వారు కనీసం చేపనూనెనైనా ఉపయోగించాలి. గుండె ఆరోగ్యానికి చేప నూనె ఎంతో మంచిది. చేప నూనెని తీస్కునే వారు ఎక్కువగా హృద్రోగం బారిన పడకుండా ఉన్నారని ఎన్నో నివేదికలు తేల్చాయి. చేప నూనె శరీరంలో కొవ్వు స్థాయిలను ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడం మూలంగా అధిక రక్తపోటుని, గుండెపోటును మరియు అధిక బరువుని తగ్గిస్తుందని చెబుతున్నారు. చేప నూనె ఊబకాయం స్థాయిని పెరగకుండా నిలువరిస్తుంది. తద్వారా అనేక రుగ్మతలకు కళ్ళెం వేస్తుంది.

చేప నూనె గుండెజబ్బులను నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని కనుగొన్నారు. జీవక్రియలో ఇబ్బందులు ఉన్న జబ్బులు మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన చాలా లాభం పొందుతారు. చేప నూనెతో తయారు చేసిన క్యాప్సూల్స్ కూడా మనకు లభిస్తున్నాయి. అయితే ఈ క్యాప్సూల్స్ లేదా చేప నూనె ఈ రెండింటిలో దేన్ని తీసుకున్నా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. చేపలు తినని వారు మార్కెట్లో అందుబాటులో ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పలు పరిశోధనల్లో కూడా తేలాయి.
గుండెను పదిలం చేసుకోవాలంటే వారానికి ఒక్కసారైనా చేపలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు 6 నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపలు తినడం ఇష్టం లేనివారు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన చాలా లాభం పొందవచ్చు.








