Cinema News: మార్చి రేసు నుంచి తప్పుకున్న రామ్ చరణ్ పెద్ది..మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్

By manavaradhi.com

Published on:

Follow Us
Ustaad Bhagat Singh Release Date,Peddi New Release Date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘పెద్ది'(Peddi) . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ రెండు చిత్రాల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో, తాజాగా రిలీజ్ డేట్స్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాది మార్చి 27న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi) వాయిదా పడిందని, దీంతో అదే సమయంలో మార్చి 26న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విడుదల కానుందని ఇటీవల ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మార్చి 26న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు కూడా తమ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Leave a Comment