Gold, Silver Price: భారీగా తగ్గిన వెండి, బంగారం ధర.. ఎంతంటే?

By manavaradhi.com

Published on:

Follow Us
Gold, Silver Price

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ధరలు పతనమయ్యాయి. ఎంసీఎక్స్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే ధరలు కుప్పకూలాయి.

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గోల్డ్ రేట్ల పెరుగుదలకు మళ్లీ బ్రేక్ పడింది. గత ఐదు రోజులుగా ధరలు పతనమవ్వగా.. బుధవారం కాస్త పెరిగాయి. గురువారం మళ్లీ ధరలు కప్పకూలాయి. గంటల వ్యవధిలోనే బంగారం ధరలు సీన్ రివర్స్ అయ్యాయి. ఇక వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి.

మొన్నటి వరకు కొండెక్కిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ. 6,600 తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,550గా ఉంది. కిలో వెండి రూ.2,69,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే దాదాపు రూ. 30వేలు ధర తగ్గింది.

Leave a Comment