మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ కె కూడా ఒకటి. సాధారణంగా చాలా మందికి విటమిన్ ఎ, బి, సి లు ఉన్న ఆహారాలను తినాలని తెలుసు. కానీ కె విటమిన్ ఉన్న ఆహారం గురించి అంతగా తెలియదు. నిజానికి మిగిలిన విటమిన్లతోపాటు కె విటమిన్ కూడా మనకు అవసరమే. అయితె ఇది ఏయే ఆహారాల్లో లభిస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ముఖ్యమైన విటమిన్ ఇది. విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. విటమిన్స్ అనగానే, విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యాన్ని ఉపయోగపడేవని గుర్తించాలి. ఆరోగ్యకరమైన బోన్స్ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మన శరీరంలో ఏ భాగానికి అయినా గాయం అయినప్పుడు రక్తం స్రవిస్తుంది. అయితే అలా స్రవించే రక్తం వెంటనే గడ్డ కడుతుంది కూడా. శరీరం నుంచి రక్తం ఎక్కువగా పోకుండా ఉండేందుకు రక్తంలో ఉండే కె విటమిన్ రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తుంది.
ఆస్టియోపోరోసిస్ అనే కీళ్ల వ్యాధి రాకుండా ఉండాలంటే రోజూ విటమిన్ కె ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు విటమిన్ కె ఎక్కువగా అందేలా చూసుకోవాలి. విటమిన్ కె వల్ల గుండెకు మేలు జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ గుండె ధమనులు గట్టిపడకుండా ఉండేందుకు ఈ విటమిన్ దోహదపడుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంతేకాదు.. గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెకి చేరే రక్తసరఫరాలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా విటమిన్ కె సహాయ పడుతుంది.
ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో విటమిన్ కె తో పాటూ విటమిన్ ఎ , సి లు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు మన డైట్ లో భాగం చెసుకోవాలి. విటమిన్ కె కొవ్వులో కరిగే విటమిన్. కె విటమిన్ మనకు సహజంగా రెండు రకాలుగా దొరుకుతుంది. మొక్కల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె1 పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. జంతుకణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె2. విటమిన్-కె దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటుంది. దీన్ని మనపేగులోని బ్యాక్టీరియా సంశ్లేషిస్తుంది.
ముఖ్యంగా పాలకూర, కాలీఫ్లవర్, సోయాబీన్, గోధుమ, కాలేయం లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. డార్క్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. బ్రొకోలీలో కూడా అధిక మోతాదులో విటమిన్ కె లభిస్తుంది. క్యాబేజ్ ను తినడానికి చాలా మంది ఇష్టపడరు కానీ ఇందులో మనకు కావాల్సిన విటమిన్లు చాలనే ఉన్నాయి. దీన్ని మనం ఏ రకంగా తిన్నా వీటిల్లో విటమిన్ కె, సి , బి6 శరీరానికి అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహకరిస్తుంది. పచ్చి బఠానీలను ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, కెలు ఆరోగ్యాన్ని సమతూకంలో ఉంచుతాయి. బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ కె లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు.
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల్లో విటమిన్ కె తక్కువగా ఉంటుంది. అందుకని వారికి వైద్యులు విటమిన్ కె ను ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. ఇక పురుషులకు రోజుకు 120 మిల్లీగ్రాములు, స్త్రీలకు రోజుకు 90 మిల్లీగ్రాముల విటమిన్ కె అవసరం ఉంటుంది. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది చెందకుండా శరీరానికి కాపాడుతుంది. క్యాలీఫ్లవర్ లో కూడా విటమిన్ కె మనకు ఎక్కువ పాళ్ళల్లో లభిస్తుంది. సోయాబీన్ ఆయిల్, ఆలీవ్స్ లో కొద్ది మెత్తంలో కెవిటమిన్ లభిస్తుంది. విటమిన్ కె ఎక్కువగా ఆకు కూరలు, మాంసాహారం, సోయా బీన్స్, పాలు దాని సంబంధ పదార్థాల్లో మనకు లభిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ కె లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు.








