ANTI INFLAMMATORY FOODS : శరీరంలో వాపులను తగ్గించే ఆహార పదార్థాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
ANTI INFLAMMATORY FOODS

శరీరానికి గాయమైనా, ఇన్ఫెక్షన్ వచ్చినా రోగ నిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో సంబంధిత ప్రదేశంలో వాపులు ఏర్పడతాయి. అలా వాపు వస్తేనే రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తోందని అర్ధం. శారీరక రోగ నిరోధక వ్యవస్థ వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఐతే కొన్ని కారణాల వల్ల వాపులు తగ్గని పరిస్థితి నెలకొంటే.. ఏదో వ్యాధి వచ్చిందని గుర్తించాలి. ఈ క్రమంలోనే.. మందగించిన శారీరక రోగ నిరోధక తిరిగి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీన్ని మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారానే క్రమబద్ధీకరించుకోవచ్చు.

ఇన్ఫ్లమేషన్.. అంటే వాపులు… శరీరంలో ఇన్ఫెక్షన్ లు , లేదా గాయాల వల్ల వాపులు ఏర్పడతాయి. ఈ వాపులు ఎక్కువగా ఏర్పడితే సోరియాటిక్ ఆర్థరైటిస్,, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. ఈ సమయంలో ఒత్తిడి, వాపులు కలిగించే ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే వాపులతో పోరాడే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీలైనంత వరకు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. నైట్ షేడ్స్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ గా పిలిచే టోమాటోలు, ఆలుగడ్డ, మిరియాలను తీసుకోవాలి. టోమాటోల్లో ఉండే లైకోపేన్, విటమిన్ C ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది. బాదంపప్పు మరియు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాదం పప్పుతోపాటు జీడిపప్పు, పల్లీలు కూడా ఈ విషయంలో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ E శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే సాల్మన్ ఫిష్, సార్డిన్ ఫిష్ నుంచి మంచి ప్రొటీన్ లభిస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి.

నిమ్మజాతికి చెందిన నిమ్మకాయలు, కమలా పండ్లు, అంగూర్ ఫలాల్లో వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో రోగ నిరోధ శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే సిట్రస్ జాతికి చెందిన నారింజ, గ్రేప్ ఫ్రూట్‌, బత్తాయి పండ్లను తరచుగా తీసుకుంటే వాపుల బారి నుంచి తప్పించుకోవచ్చు. పాలకూర, బ్రొకొలి లాంటి ఆకుపచ్చిన కూరలు తీసుకుంటే వాపులను తగ్గించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మరోవైపు పసుపు.. కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుందంటున్నారు. శరీరంలో వాపులు వచ్చేవారు ప్రాసెస్డ్ ఆహారాలు, వైట్ పాస్తా, చక్కెర పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్స్‌, సోయా బీన్ ఆయిల్‌, రిఫైండ్ ఆయిల్స్‌, గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, మద్యం తీసుకోవద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment