ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు దస్తావేజు లేఖకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్‌డౌన్.
ఉయ్యూరు, జులై 22; ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు దస్తావేజు లేఖకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పెన్‌డౌన్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 396 అమలుతో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి తీవ్ర విఘాతం కలుగుతోందని, వేలాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన నూతన విధానాలకు అనుగుణంగా లేఖరుల సేవలు అందిస్తున్నప్పటికీ ఈ విధమైన విధానాలతో లేఖరుల ఉపాధి దెబ్బ తిసే విధంగా వ్యవహరించడం భావ్యం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకుని డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమానికి ప్రజలు, సంబంధిత వర్గాలు మద్దతు ఇవ్వాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ఎంఎస్ నెంబర్ 396 కారణంగా లేఖల జీవనోపాధి దెబ్బతింటుంది అని ఈ కార్యక్రమంలో పెనమకూరు వెంకట లక్ష్మీనారాయణ, కోశాధికారి వి.వీరభద్రరావుతో , పి.వి.ఎన్. శర్మ,పాటు ఆళ్ల వెంకటరెడ్డి, ఎండి రఫీ, కె. నరసింహమూర్తి,ఇందుపల్లి ప్రసాద్, వల్లూరు సాయిబాబు ,పరిమి ప్రసాద్,డి ఎస్ శర్మ,టీవీ చలపతిరావు, ఎం. రామ్మోహన్రావు,ఎస్ రాజా, డీవీఎన్ఆర్ ప్రసాద్, డీఎన్ఎస్ మోహన్‌కృష్ణ, శీలం రత్నరాజు, కె. నాగభూషణం, జుజువరపు మల్లేష్, పి. సురేష్,కె. రామిరెడ్డి,డి. మోహన్ కృష్ణ, జె.నాగతరుణ్, ఆరేపల్లి దుర్గ, కే. దివ్య, జై లక్ష్మీ దుర్గ, ఎండి అర్షద్ తదితరులు పాల్గొన్నారు.









