AP Govt: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

By manavaradhi.com

Published on:

Follow Us
AP Govt

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఇటీవల హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ తన వైఖరిని స్పష్టం చేస్తోంది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారడంతో.. సుప్రీంకోర్టు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Leave a Comment