మాదాపూర్ దుర్గంచెరువు సమీపంలో స్ట్రీట్ పుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎంతలా అంటే సీఎం రెవంత్ రెడ్డి సైతం త్వరలో వచ్చి భోజనం చేసి వెళ్ళతా అనె అంతాలా….
Kumari Aunty food stall: ప్రస్తుతం సోషల్ మీడియాలో స్ట్రీట్ పుడ్ అంటే టక్కున గుర్తు వచ్చే పేరు హైదరాబాద్ లోని కుమారి ఆంటీ. ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ ప్రాంతానికి చెందిన దాసరి సాయి కుమారి 2011 నుంచి స్ట్రీట్‌ఫుడ్ స్టాల్ ను నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కుమారి ఆంటీ పుడ్ స్టాల్ కు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారం లభించడంతో జనం జనం తండోప తండాలుగా ఎగబడ్డారు. ఎంతలా అంతే పక్క రాష్ట్రాలో ఉన్న వారుకూడా ఆమె పుడ్ ఎలా ఉంటుదా అనే చూడాడని మరీ వస్తున్నారు. దీంతో ఆమె బిజినెస్ బాగా పెరిగింది. అయితే ఆమె మూలంగా అక్కడ ట్రాఫిక్ అమాతం పెరిగిపోతుంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి.. స్ట్రీట్‌ఫుడ్ స్టాల్ ను తొలగించాలని ఆదేశించారు.
మాదాపూర్ దుర్గంచెరువు సమీపంలో స్ట్రీట్ పుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తక్కువ ధరలో క్వాలిటీ భోజనం అందిస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో కుమారి ఆంటీ పుడ్ స్టాల్ కు జనం పోటెత్తారు. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ జనంతో కిటకిటలాడుతోంది. ఎంతలా అంటే మాములు జనం అటువైపు వెళితే ట్రాఫిక్ లో చిక్కుకు పోమే అంతలా… ఫుడ్ స్టాల్ వచ్చే జనంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పందించిన పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు.
ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారు. కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను యధావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో కుమారి ఆంటీ యదావిధిగా అక్కడ తన పుడ్ స్టాల్ ను కోనసాగిస్తుంది. కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులను కోరారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని సూచించారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీయిచ్చారు. దీంతో కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ కోసం ఎగబడె జనం కోంచం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏది ఏమైనా మనవాళ్ల దగ్గర ఉన్న వెర్ని మరెక్కడ ఉండదు కదా…