Lord Vishnu : శ్రీమహావిష్ణువును ఏ క్షేత్రాలలో ఏ పేరుతో పూజించాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Lord Vishnu

• బృందావనంలో గోవిందుడిగా
• గయనందు గదాధరునిగా
• కాశ్మీరమందు చక్రధారిగా
• చిత్రకూటంలో రామునిగా
• పుష్కరక్షేత్రంలో పుండరీకాక్షుడిగా
• లోహదండమందు శ్రీమహావిష్ణువుగా
• ప్రభాసమున మధుసూదనుడిగా
• జయంతినందు జయునిగా
• యముననందు త్రివిక్రమునిగా
• కుబ్జాశ్రమమునందు జనార్థనుడిగా
• కురుక్షేత్రమందు వామనుడిగా
• శాలిగ్రామమందు సిద్ధుడిగా
• శోణమందు విశ్వేశ్వరుడిగా
• దక్షిణసముద్రాన పద్మనాభుడిగా
• గోవర్థనాచలమందు హారిగా
• ప్రయాగనందు యోగశాయిగా
• గంగాద్యారమందు పురుషోత్తముడిగా
• పిండారకమందు చతుర్బాహుడిగా
• శ్రీకుబ్జమందు శ్రీరంగుడిగా
• శంఖుద్వారమునందు శంఖధారిగా
• మధురనందు కేశవుడిగా
• సింధునదీప్రాంతాన యోగీశర్వరుడిగా
• భువిపైన మానవునిగా
• నైమిశారణ్యమందు య..పురుషుడిగా
• హిమాలయమందు విశ్వరూపుడిగా
• వింధ్యపర్వతాన సర్వపాపహరుడిగా
• సహ్యాద్రిపర్వతాన దేవదేవుడిగా
• అశ్వదీర్థమందు హయగ్రీవుడిగా
• ప్రతివటమందు కుబేరుడిగా
• నర్మదతీతప్రాంతాన శ్రియఃపతిగా
• మహేంద్రాది యందు రామునిగా
• నందయనందు జలాశాయిగా
• ద్వారకనందు శ్రీకృష్ణుడిగా
• రైవతకమునందు దామోదరునిగా
• విపాశనదీప్రాంతమందు బ్రాహ్మణప్రియుడిగా
• కృతశౌచమందు నృసింహుడిగా
• ఓడ్రము నందు పురుషోత్తముడిగా
• దండకము నందు శార్ జ్గధారునిగా
• ఉత్పలావర్తవమున శౌరిగా
• జంబూ నందు అచ్యుతునిగా
• అంతరిక్షమందు గరుడధ్వజునిగా
• పర్వతములందు రామునిగా
• అన్నివేళలా మధుసూతనుడిగా
• ప్రతి గృహమునందు శివునిగా
ఈ క్షేత్రాలు నామాలను సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు విష్ణుపురాణం చెప్తోంది.

Leave a Comment