Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు మంచి మార్గాలు ఇవే!

By manavaradhi.com

Published on:

Follow Us
Stay Healthy

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా గుడ్ హెల్త్ ను సొతం చేసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల హాయిగా, ఆరోగ్యంగా ఉండవచ్చు .ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. ప్రతి భోజనంతో పాటు వాటి మధ్య కూడా ఒక గ్లాసు నీరు త్రాగాలి. వ్యాయామానికి ముందు, సమయంలో మరియు తర్వాత కూడా నీరు త్రాగాలి.

రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. బ్రిస్క్‌ వాక్‌ వల్ల శరీరం, మెదడు రెండూ చేతనంగా తయారవుతాయి. తీవ్ర అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడిలు తొలగి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 40 నిమిషాల నడక అవసరం. నడక వల్ల ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. దాంతో ఊపిరితిత్తులకు, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అంది అవి మెరుగ్గా పని చేస్తాయి. చమటతో ఒంట్లోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

ఆరోగ్యం విషయంలో ఆహారాలు ముఖ్యమైన పాత్రను పొషిస్తాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకొంటేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. లేదంటే ఆకలి, నీరసంతో పనిచేయగలం అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారము తీసుకోవడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను వెంట తెచ్చుకొని తింటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

మ‌న శ‌రీరానికి సూట్ అయ్యే ఆహారాల‌పై దృష్టిపెట్టాలి. సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. మధ్యాహ్న భోజనంలో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా వాటిని దూరంగా ఉంచితే మంచిది. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లే కీలకం. మ‌నం చేసే పనులు, అనుసరించే నియమాల పైన మాత్రమే మ‌న‌ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మ‌రిచిపోవ‌ద్దు. సంవత్సరంలో రెండు సార్లు తప్పకుండా దంతవైద్యుడిని సంప్రదించాలి. యువకులు 20 ఏళ్లలో ఒకసారి, 30 ఏళ్లలో రెండుసార్లు కంటి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి సంకేతాలు తరచుగా కనిపించినప్పుడు, 40 ఏళ్ల వయస్సులో ఖచ్చితంగా అపాయింట్‌మెంట్ తీసుకోండి. 65 ఏళ్లు పైబడివారు, ప్రతి సంవత్సరం కళ్ళను తనిఖీ చేసుకోండి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి.

పొగ తాగడం లాంటి అలవాట్లకు చెక్ పెట్టాలి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

Leave a Comment