మోగా స్టార్ చిరంజీవి అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న మెగా 157 టైటిల్‌ను రివీల్ చేశారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దీని టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన వీడియోకు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినీ ప్రియులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. చిరు సరసన త్రిష నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Mega 157: చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్ .మెగా 157 టైటిల్
Published on:
