Mayasabha web series review: వెబ్‌సిరీస్‌ మయసభ రివ్యూ

By manavaradhi.com

Published on:

Follow Us
Mayasabha Web Series

దర్శకుడు దేవ కట్టా ‘మయసభ’ (Mayasabha Web Series) అంటూ టీజర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండ నాయకుల జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ సోనీ లివ్‌లో ఒక రోజు ముందు నుంచే స్ట్రీమింగ్ మొదలు పెట్టేశారు. మరి సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ: చిత్తూరు జిల్లాకు చెందిన కాకర్ల కృష్ణమనాయుడు (కేకేఎన్‌) పీజీ పూర్తి చేసి, పీహెచ్‌డీ చేసేందుకు యూనివర్సిటీలో చేరతాడు. విద్యార్థి రాజకీయాల్లో చేదు అనుభవాలు ఎదురైనా, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎంఎస్‌ రామిరెడ్డి (ఎంఎస్‌ఆర్‌) తండ్రి చేసే ఫ్యాక్షన్‌ గొడవలు ఇష్టం లేక, వైద్య విద్యను అభ్యసించడానికి బళ్లారి వెళ్తాడు. అనుకోని పరిస్థితుల్లో కృష్ణమనాయుడు, రామిరెడ్డి ఇద్దరూ కలుస్తారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులు వాళ్లను స్నేహితులుగా మారుస్తాయి. కలిసి రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరి పయనం ఎలా సాగింది? ప్రజలకు మేలు చేయడానికి వీరిద్దరూ కలిసి ఆడిన రాజకీయ చదరంగం ఏంటి?(Mayasabha Web Series Review) తెలుగువారి అభిమాన నటుడు రాయపాటి చంద్రశేఖరరావు (ఆర్‌సీఆర్‌) రాజకీయ పార్టీ స్థాపించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పును తీసుకొచ్చాయి? తెలుగులో టాప్ హీరో ఆర్సిఆర్ (సాయికుమార్) కుమార్తెను వివాహం చేసుకున్న కృష్ణమ నాయుడు, ఆర్సిఆర్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది? స్నేహితులుగా ఉన్న రామిరెడ్డి, కృష్ణమ నాయుడు ఎందుకు విడిపోవలసి వచ్చింది? చివరికి వారు కలిసారా లేదా అనే విషయాలు తెలియాలంటే సిరీస్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే, కాకర్ల కృష్ణమ నాయుడు అనే పాత్రలో ఆది పినిశెట్టి ఇమిడిపోయాడు. చంద్రబాబు నాయుడుని గుర్తు చేస్తూ ఉండే ఈ పాత్రను చాలా బాగా డిజైన్ చేసుకోవడమే కాదు, ఆది పినిశెట్టి చేత అంతే అద్భుతంగా పెర్ఫార్మ్ చేయించారు. ఎమ్మెస్ రామిరెడ్డి అనే పాత్రలో చైతన్య రావు కూడా ఆకట్టుకున్నాడు. నిజానికి వ్యక్తిగతంగా ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు చైతన్య రావు వైఎస్ పాత్రలో సూట్ కాడేమో అనిపించింది, కానీ నటన విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇక స్టార్ హీరోగా సాయికుమార్ అదరగొట్టాడు. పరిటాల రవి పాత్రలో రవీంద్ర విజయ్‌కి ఇంకా నటించే స్కోప్ ఈ సిరీస్ మొదటి సీజన్‌లో దక్కలేదు. వంగవీటి రంగాను పోలి ఉండే పాత్రలో శత్రు ఆకట్టుకున్నాడు. అయితే బాంబుల శివారెడ్డి అనే పాత్ర చేసిన నటుడు మాత్రం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాస్టింగ్ మాత్రం సినిమాకి ఒక ప్లస్ పాయింట్. కేసీఆర్‌ను పోలి ఉండే పాత్ర కోసం అలాంటి లక్షణాలతోనే ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చారంటే, కాస్టింగ్ కోసం ఎంత శ్రద్ధ పెట్టారో ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ సిరీస్ టెక్నికల్‌గా చాలా టాప్-నాచ్ క్వాలిటీతో ఉంది. ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో, ఈ సిరీస్‌కి అంత ఖర్చు పెట్టినట్లు అర్థమవుతుంది. విజువల్స్ కానీ, ఏఐ వాడకం కానీ బావుంది. సిరీస్‌లో పాటలు లేవు, కానీ సహోదర అంటూ వచ్చే ట్రాక్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సిరీస్ కాబట్టి నిడివి విషయంలో లిబర్టీ తీసుకున్నారు, అయితే అది వర్క్ అనిపించింది.

సిరీస్‌ బాగుంది. ఇద్దరు రాజకీయ నాయకులు యువకులుగా ఉన్న కాలం నాటి పరిస్థితులను చాలా చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫ్రీకి మార్కులు పడతాయి. సినీ నటుడు ఆర్‌సీఆర్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలను రీక్రియేట్‌ చేసిన తీరు బాగుంది. ఇంకాస్త షార్ప్‌గా ఎడిటింగ్‌ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్‌ ఎపిసోడ్స్‌ తక్కువ సమయమే ఉన్నా, చివరికి వచ్చేసరికి నిడివి పెరిగిపోతూ వచ్చింది. దర్శకుడు, రచయిత దేవాకట్టా (mayasabha web series director) ‘మయసభ’ను తనదైన శైలిలో బలమైన పొలిటికల్‌ డ్రామాగా ఆవిష్కరించారు.

Leave a Comment