మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ మొదలు పెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వీడియోను పంచుకుంది. ఇందులో చరణ్‌తో పాటు, దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘‘బుచ్చి.. ‘చికిరి’ సాంగ్ వీడియోలో మోహిత్ చౌహాన్ కన్నా నువ్వే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఆ పాట నువ్వు పాడావా? ఆయన పాడాడా? అన్న అనుమానం వచ్చింది. డబ్బింగ్లో కూడా అలా యాక్ట్ చేయకు. నేనే డబ్బింగ్ చెప్పానండీ. ఇది నిజం’’ అంటూ జోక్‌లు వేసి నవ్వులు పంచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.









