భారీ తారాగణంతో నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’గా ఇది రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీని షూటింగ్ పూర్తయినట్లు కొన్ని వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి.
ఈ సినిమాకి గురించి ఏ అప్‌డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఈవెంట్‌ను జులై 3న ఏర్పాటుచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూర్‌లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం తారలంతా అక్కడికి బయల్దేరుతున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్‌గా మారాయి.
రెండు భాగాలుగా రానున్న ‘రామాయణ’ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రబృందం సంబరాలు చేసుకుంటోన్న వీడియోలు కూడా ఎక్స్‌లో కనిపిస్తున్నాయి. వాటిలో టీమ్ అందరికీ రణ్‌బీర్ కపూర్, నితేశ్ తివారీలు ధన్యవాదాలు చెబుతూ కనిపిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ r, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు రణ్‌బీర్ ‘రామాయణ’ కోసం తన అలవాట్లను మార్చుకున్నారు. కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు. ‘‘రామాయణ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటినుంచి వింటూ పెరిగాం. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు. నితీశ్ తివారీ దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అని ఇటీవల రణ్‌బీర్ తెలిపారు.