Anti Aging Diet: మీరు ఈ ఆహారాలు తీసుకుంటే వృద్ధాప్యం దూరం!

By manavaradhi.com

Published on:

Follow Us
Diet for a Lifetime

వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల వృధాప్య ఛాయలు దరికిరాకుండా కాపాడుకోవచ్చు.చిన్న పాటి జాగ్రత్తల ద్వారా నిత్యం యవ్వనంలా ఉండేలా చూసుకోవచ్చు. ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.

లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకుంటే చాలు. వీటన్నింటినీ తగిన మోతాదులో తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది. వ్యాధులు దూరం అవుతాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు. ముఖ్యంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చని కూరగాయాల్లో అధికశాతంలో విటమిన్లు ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి చర్మంలోని కణజాలాలను దెబ్బతినకుండా రక్షించేందుకు దోహదపడుతాయి.

యాంటీఆక్సిడెంట్లను ఆహారం ద్వారా తీసుకోవచ్చు. ఈ రకమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మరియు మన చర్మం యొక్క రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఎక్కువగా వృద్ధాప్య ప్రక్రియను నివారించవచ్చు.

ఆరోగ్యమైన శరీరం, నిత్య యవ్వనం మీ సొంతం కావాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. తృణధాన్యాలు శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి. రోజూ తినే ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి.

బీన్స్ కూడా తీసుకోనే ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫ్యాట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్లు కూడా ఉంటాయి. బీన్స్ లేదా రాజ్మా మొక్కల్లో ప్రోటీన్ల అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ఎనిమిది వరకు వీటిలో ఉంటాయి. పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల్లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలి. వేరుశెనగ, వాల్‌నట్స్, హాజెల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. మీరు శాఖాహారులు అయితే పప్పులు, చిక్కుళ్ళు, పనీర్, టోఫు ఎక్కువగా తినాలి. మీరు మాంసాహారి అయితే గుడ్లు, చేపలు తినాలి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.

మంచి ఆహారపు అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. సాల్మన్ ఫిష్ లో హెల్తీ ప్రోటీన్ పుష్కలంగా ఉంది. సాల్మన్ ఫిష్ ను వారానికి ఒక సారి తినడం వల్ల వయస్సు పైబడనియ్యకుండా కాపాడుతుంది.

ఆలివ్ ఆయిల్, నూనెల్లో అన్నింటికంటే చాలా తక్కువ కొవ్వు కలిగిన నూనె ఆలివ్ ఆయిల్. సుద్దమైన ఆలివ్ ఆయిల్లో యాంటియాక్సిడెంట్ పుష్కలంగా ఉండి స్కిన్ సెల్ పునరుద్దరణను వేగవంతం చేస్తాయి. తృణధాన్యాలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . అంతే కాదు అంతర్గతంగా టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి , చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మార్చుతాయి.

పాల ఆహారాలలో మన మైక్రోఫ్లోరాకు అవసరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. కడుపు మరియు ప్రేగుల యొక్క సమన్వయ పని మొటిమలు, అలెర్జీ చర్మ దద్దుర్లు, ముడతలు మరియు చర్మం యొక్క మడతలు వంటి సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన వృధాప్యాన్ని దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. దీని పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా, మన సంప్రదాయ ఆహారాలతోనూ, మంచి జీవన శైలిని పాటిస్తూ…..చెడు అలవాట్లను విసర్జించడం ద్వారా మనం యవ్వనంగా ఉండేలా చూసుకోవచ్చు.

Leave a Comment