Food For Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే వీటిని తినండి చాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు… శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. తగినన్ని నీళ్లు తాగకపోవడం, సమతుల ఆహారం తీసుకోక పోవడం వంటి వాటితో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. నడుం భాగం నుంచి పొత్తి కడుపులోకి విపరీతంగా నొప్పి వ‌స్తే అది కిడ్నీలో రాళ్ల వల్లనే అని వైద్యులు చెబుతుంటారు. తాత్కాలిక నివారణకు నొప్పి నివారణ మందులు ఇచ్చినా కిడ్నీలో రాళ్లు బయటకు పోయేంత వరకు నొప్పి మాత్రం మనల్ని వదలదు. మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. ఎక్కువగా విటమిన్ డీ, ఖనిజ అసమతుల్యత, అతిసారం, గౌట్, అసమాన ఆహారం తీసుకొవటం వంటివి కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కొన్ని ఇతర కారణాలుగా చెప్పవచ్చు.

కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. తాజా పండ్లను, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. బెర్రీస్ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ ను తీసుకోవడం ద్వార మూత్రపిండాలను శక్తివంత చేసి ఆరోగ్యం ఉండేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ది చేసి రక్తంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది. కొత్తిమీర తో ఫలితాలు బోలెడున్నాయ్. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది.

కిడ్నీలోని రాళ్ళు తొలగించడానికి ఉపయోగించే ఔషదాల్లో ఉపయోగిస్తారు. అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది. ఇది కిడ్నీలను శుభ్రపరుచుటలో, రక్తం శుద్దిచేయడంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి మూత్రపిండాల మొక్క ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అల్లం చిన్న ముక్కను లేదా అల్లం రసంను సేవించడం మంచిది. పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంది. కిడ్నీలను శుభ్రం పరుచుటలో పసుపు కూడా ఒక ముఖ్య ఔషదం. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతమైన యాంటీ బయాటిక్స్‌గా పనిచేస్తాయి. గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేదుకు ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

రోజుకు 2 – 3 లీటర్ల నీళ్లు త‌ప్ప‌నిస‌రిగా తాగాలి. అదే పనిగా నీళ్లు తాగేందుకు ఇబ్బందిప‌డేవారు మజ్జిగ, చక్కెర కలపని పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసంవంటివి తాగొచ్చు. ఆహారంలో ఉప్పు మితంగా తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళు తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ డ్ పుడ్స్, ఫాస్ట్ పుడ్స్ కు సాధ్యామైనంత దూరంగా ఉంటే మంచిది. విటమిన్‌ సి, క్యాల్షియమ్‌ సప్లిమెంట్ల వంటి మాత్రలను కేవలం వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. శీతల పానియాలను పూర్తిగా మానేయడం ఉత్త‌మం. దానిమ్మ రసం రాళ్లు, నొప్పి నిర్వహణలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. తులసి టీ.. మూత్రపిండాలు సాధారణ ఆరోగ్యాన్ని పెంచడంలో అత్యంత సమర్థవంతమైనది. ఇవేకాకుండా పుచ్చ‌కాయ‌, ద్రాక్ష‌, పీచు ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, సేంద్రీయ కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉంటున్నందున‌ వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి.

సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కిడ్ని స్టోన్స్ ఏర్పడుతాయి. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే కిడ్ని స్టోన్స్ లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పకుండా జాగ్రత్తపడవచ్చు. శ‌రీరంలో కాల్షియం, మిన‌ల్స్ ఎక్కువ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌ట‌మే అన్నింటికీ మంచిది.

Leave a Comment