Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌ చూసి దర్శకుడిని అభినందించిన పవన్‌

By manavaradhi.com

Published on:

Follow Us
Hari Hara Veera Mallu Trailer

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రేపు పేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని ట్రైలర్‌ విడుదల వివరాలను టీమ్‌ అభిమానులతో పంచుకుంది.

జులై 3 ఉదయం 11.10 గంటలకు ఇది విడుదల కానున్నట్లు తెలిపింది. పవన్‌కల్యాణ్‌ ఈ ట్రైలర్‌ చూసి ఎంజాయ్‌ చేస్తోన్న వీడియోను పంచుకుంది. ఆ వీడియో చివర్లో పవన్‌ దర్శకుడిని అభినందించారు. ‘చాలా కష్టపడ్డావ్‌..’ అంటూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ‘‘తుపాను వెనక ఉండే శక్తి.. ట్రైలర్‌ చూశాక పవన్‌ కూడా తన ఉత్సాహాన్ని అదుపు చేయలేకపోయారు’’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి పవన్‌ ఈ ట్రైలర్‌ను వీక్షించారు

మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ప‌వ‌న్‌ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌తో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందులో మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ అనే పేరుతో వ‌స్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Comment