Health Tips: శరీరానికి సరైన పోషణ అందాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి

By manavaradhi.com

Published on:

Follow Us
Role of Diet in our well-being including cleanliness

మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి నిద్ర ఈ మూడింటి వల్ల జీవన నాణ్యత పెరుగుతుంది. ఈ రోజుల్లో లావుగా కనిపించే వారికి కూడా పోషకాహార లోపం కనిపిస్తోంది. లావుగా ఉన్నంత మాత్రాన, ఎక్కువగా ఆహారం తీసుకున్నంత మాత్రాన పూర్తి పోషణ అందినట్లు కాదు. శరీరానికి, వయసుకు తగిన పోషణ ఆహారం ద్వారా అందాలి. అతిగా తినడం లేదా అతిగా ఉపవాసాల్లాంటివి చేయడం అంత మంచిది కాదు. ప్రస్తుతం ఉరుకు పరుగుల జీవితంలో వేళా పాళా లేకుండా ఏదో తినేశాం అనుకుంటూ మొక్కుబడిగా ఏదో ఒకటి పొట్టలో వేసేస్తున్నాం. జంక్ ఫుడ్స్, శీతల పానియాల్లాంటివి దానికి తోడైతే ఇంకేముంది… పోషకాలు అందడం అనే విషయం పక్కన పెడితే రకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.

సరైన ఆహారం అంటే రోజుకు ఎన్ని పూటలు తినాలి అనే సందేహాలు కూడా కలగవచ్చు. అయితే ఒకే రకమైన ఆహారం అందరికీ పోషకాలు అందిస్తుందని చెప్పలేము. పోషకాలు అందడంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏదేమైనా ఆహారాన్ని మరి ఎక్కువో లేదంటే మరీ తక్కువో తీసుకోకూడదు. కచ్చితంగా తగినంత అహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. వేళను పాటించాలి. ఇలా చేయడమే శరీరంలో జీవక్రియలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మనం తీసుకునే ఆహారంలో జీర్ణం కాని పదార్థాలకు ఇది మంచి మందు. వాతావరణాన్ని, ఆరోగ్య పరిస్థితిని దృష్టి పెట్టుకుని విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు… ఇలా అన్నింటి సమ్మిళితమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అనగానే చాలా మంది భయపడుతుంటారు. అయితే మేలు చేసే కొవ్వులు మాత్రం శరీరానికి అందాల్సిందే. అదే విధంగా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోక ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. ఇవి పొట్ట మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే సరైన ఆహారాన్ని సరైన విధానంలో తీసుకుంటూ ఉండాలి.

మంచి ఆహారం శరీరానికి శక్తిని అందిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి పరిశుభ్రత తప్పనిసరి. ఎందుకంటే శుభ్రత లోపిస్తే, అమృతం లాంటి ఆహారం కూడా విషంలా మారిపోతుంది. ఆహారాన్ని ఒకే సారిగా కాకుండా, మన ఆరోగ్యాన్ని బట్టి, న్యూట్రిషన్ సలహాలను దృష్టిలో ఉంచుకుని రోజులో అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం తీసుకోవచ్చు. అయితే శుభ్రత మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా నోటి శుభ్రత విషయంలో అస్సలు రాజీ పడకూడదు. శరీరం శుభ్రత సంగతి సరేసరి. అలాగే మనం ఆహారం తినే ప్లేట్లు, నీళ్ళు తాగే గ్లాసులు లాంటివి ఎంత వరకూ శుభ్రంగా ఉన్నాయో చూసుకోవాలి. తినే వాతావరణం కూడా అంతే శుభ్రంగా ఉండడం తప్పనిసరి. ఇక్కడ వాతావరణం అంటే భౌతికంగా మాత్రమే కాదు మానసికంగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో తినడం మంచిది.

Leave a Comment